Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రాధేశ్యామ్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. తదుపరి రిలీజ్ కోసం రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నాడు. అందులో ఒకటి ఆదిపురుష్. మైథలాజికల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ లుక్ పై, సినిమాపై ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో ప్రభాస్ తాజాగా ముంబైలోని డైరెక్టర్ ఓం రౌత్ ఇంటికి చేరుకున్నాడు. ప్రభాస్ తో పాటు ఆదిపురుష్ చిత్రబృందమంతా అక్కడికి చేరుకుంది. దర్శకుడు ఓం రౌత్ తన ఆదిపురుష్ టీమ్ అందరికీ మాంచి పార్టీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే.. పార్టీకి వచ్చిన డార్లింగ్ ప్రభాస్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాంద్రాలోని ఓం రౌత్ ఇంటివద్ద పార్టీ ఉందని సమాచారం అందుకున్న మీడియావారు అక్కడికి చేరుకొని ప్రభాస్ ఫోటోలు క్లిక్ మనిపించారు.
ఇక ఫోటోలు, పార్టీలు, మీడియా అంటే ప్రభాస్ మొహమాటపడతాడనే విషయం విదితమే. అయినాసరే ప్రభాస్ ని ఫోటోలు తీస్తూ ఆదిపురుష్ సినిమా హిట్ అవుతుందని గోల చేశారు. అయితే .. ప్రభాస్ మొహమాటంతో దిగిన ఫొటోలే ఇప్పుడు విమర్శకుల నోర్లు మూయిస్తున్నాయి. డార్లింగ్ స్లిమ్ గా మారిన కొత్త లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొన్నటివరకూ ప్రభాస్ లుక్ పై ఎలాంటి విమర్శలు గుప్పించారో తెలిసిందే. ఇప్పుడు కటౌట్ లో చేంజెస్ కనిపించేసరికి.. ఏం కటౌట్ రా బాబు అని నోరెళ్లబెడుతున్నారు.
Malli feel the bgm with this cutout 🥵🛐 #Prabhas pic.twitter.com/bNhwnMkWa7
— Sagar (@SagarPrabhas141) June 15, 2022
ఇదిలా ఉండగా.. ప్రభాస్ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మొత్తానికి ప్రభాస్ కొత్త లుక్ తో డార్లింగ్ ఈజ్ బ్యాక్.. అనిపించుకున్నాడు. ఇక వచ్చే ఏడాది విడుదల కానున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్.. శ్రీరాముడిగా కనిపించనున్నాడు. అలాగే సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమా అనంతరం డార్లింగ్ నుండి సలార్ సినిమా రాబోతుంది. ఊరమాస్ యాక్షన్ సినిమాగా సలార్ ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆ సినిమా కూడా వచ్చే ఏడాదే రిలీజ్ కాబోతుంది. మరి ట్రెండ్ అవుతున్న డార్లింగ్ కొత్త కటౌట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Team Adipurush were seen at director Om Raut’s house #Prabhas #Saifalikhan #Kritisanon #Sunnysingh#Adipurush #OmRaut pic.twitter.com/lt8gd5g3Ad
— Ashwani kumar (@BorntobeAshwani) June 15, 2022