జపాన్‌కు చెందిన ఓ యువతి ఆదిపురుష్ సినిమా చూడ్డానికి తమ దేశంనుంచి సింగపూర్ వెళ్లింది. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.
డై హార్డ్ ఫ్యాన్ అంటే ఏంటో అసలైన అర్థం చెప్పిందో యువతి. ఆమెది తెలుగు రాష్ట్రం కాదు.. భారతదేశం అంతకంటే కాదు.. దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్. బాహుబలి సినిమా చూసి ప్రభాస్ ఫ్యాన్‌గా మారిపోయింది. ఫ్యాన్ అంటే అట్లాంటి..ఇట్లాంటి ప్యాన్ కాదు. డైహార్డ్ ఫ్యాన్‌గా మారిపోయింది. ఎంతలా అంటే ప్రభాస్ సినిమా విడుదల అయితే చూసేందుకు దేశం దాటి మరో దేశానికి వెళ్లేంతలా. ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఈ సినిమా చూసేందుకు జపాన్‌లోని టోక్యో నుంచి సింగపూర్ వెళ్లింది.
సింగపూర్‌లోని ఓ ప్రముఖ థియేటర్‌లో సినిమా చూసింది. సినిమా అయిపోయిన తర్వాత అక్కడ కొంతమంది తెలుగు వాళ్లు ఆమెను పలకరించారు. ఈ సందర్భంగా జపాన్ యువతి మాట్లాడుతూ.. ‘‘ నా పేరు హరికో.. నేను జపాన్ దాన్ని. ప్రభాస్ అంటే చాలా ఇష్టం’’ అని అంటూ తెలుగులో మాట్లాడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా, ఓంరౌత్ ఆదిపురుష్ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 400 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఇక, ఈ సినిమాపై ట్రోలింగ్స్ పెరుగుతున్నాయి. ఓంరౌత్ ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్ని హాలీవుడ్ సినిమాల్లోంచి దొంగిలించాడంటూ ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. మరి, ఆదిపురుష్ సినిమా చూడ్డానికి జపాన్‌నుంచి సింగపూర్ పోయిన హరికోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Fan, Die Hard Fan of our Darling #Prabhas from Japan travelled from Tokyo to Singapore to watch the #Adipurush movie. pic.twitter.com/5lRsjv3oMX
— Prasad Bhimanadham (@Prasad_Darling) June 22, 2023