సూర్య.. ఇన్నాళ్లకు పాన్ ఇండియా సినిమాతో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పది భాషలలో రిలీజ్ కానుంది. కాబట్టి, సూర్య వన్ మ్యాన్ షో తెరపై అదిరిపోతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం..
దక్షిణాది స్టార్ హీరోలలో ఒకరైన సూర్య.. ఇన్నాళ్లకు పాన్ ఇండియా సినిమాతో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్ ఎపిక్ యాక్షన్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాలో సూర్య దాదాపు 5 డిఫరెంట్ పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూర్య కనిపించనున్న ఐదు పాత్రల పేర్లు కూడా బయటికి వచ్చేశాయి. అరతార్, వెంకటేటర్, మందాకర్, ముకాటర్, పెరుమానాథర్ అనే ఐదు పాత్రల పేర్లు ప్రస్తుతానికి లీక్ అయ్యాయి. పైగా ఈ సినిమా పది భాషలలో రిలీజ్ కానుంది. కాబట్టి, సూర్య వన్ మ్యాన్ షో తెరపై అదిరిపోతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి వీర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని అంటున్నారు. కాగా.. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉండగా.. వార్త విన్న డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కథ 1678 కాలంలో జరుగుతుందని.. ఇందులో సూర్య ఓ యోధుడిగా కనిపిస్తాడని.. అక్కడినుండి కాలక్రమేణా మరో నాలుగు పాత్రలలో సూర్య కనిపించబోతున్నాడని వినికిడి. అయితే.. మరోవైపు ఇది వీరాధివీరుడు అలెగ్జాండర్ కథాంశంతో వస్తోందని కూడా అభిప్రాయపడుతున్నారు. కెఇ జ్ఞానవేల్ రాజా-వంశీ ప్రమోద్ సినిమాని నిర్మిస్తున్నారు. మరి సూర్య సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
#Prabhas cameo in #Suriya42 🤩🔥🔥
This is going to be MASSive 💥 pic.twitter.com/lLPtLQPCg4— Young Mantra ™ (@youngmantraTFI) February 20, 2023