Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌ల ‘సలార్’ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయినట్లు సమాచారం. శరావేగంగా సాగుతున్న సినిమా షూటింగ్‌కు ప్రభాస్ పెద్దనాన్న, టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో కాస్త బ్రేక్ పడింది. సెప్టెంబర్ 11వ తేదీన కృష్ణంరాజు స్వర్గస్తులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ షూటింగ్‌కు దూరమయ్యారు.
ఇంటి దగ్గర ఉండి కృష్ణంరాజుకు సంబంధించిన కార్యక్రమాలు చూసుకున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ సలార్ షూటింగ్‌లో పాల్గొన్నారు. తాజాగా, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న షెడ్యూల్‌కు ఆయన హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో హాఫ్ స్లీవ్ షర్టు, మెడలో చైన్‌తో మాస్ లుక్‌లో ప్రభాస్ దర్శనమిస్తున్నారు. కాగా, ‘సలార్’ సినిమా దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తున్నారు. జగపతిబాబు, పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక, సలార్ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. మరి, సలార్ షూటింగ్‌లో ప్రభాస్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Salaar leaked one feat Rolex bgm #Prabhas #Adipurush #Salaar pic.twitter.com/Jyp6doEIOH
— . (@Smartkurrodu) September 24, 2022