యంగ్ రెబల్ స్టార్- బాహుబలి ప్రభాస్ ఇప్పుడో కొత్త సమస్యని ఎదుర్కొంటున్నాడు. ఆకాశమే నీ హద్దుగా అనే సినిమా తో దర్శకురాలిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సుధా కొంగర త్వరలోనే ఒక స్టార్ హీరోతో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. అది కాకుండా ప్రభాస్ తో కూడా సినిమా ను ఈమె చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ ను సుధా కొంగర వినిపించిందట. స్టోరీ లైన్ నచ్చడంతో వెంటనే నటించేందుకు ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ రాబోయే మూడు సంవత్సరాల వరకు బిజీగా ఉన్నాడు. ఆయనతో సినిమా చేయాలంటే 2024 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి అప్పటి వరకు సుధా కొంగర వెయిట్ చేస్తుందా అనేది చూడాలి.
లేడీ డైరెక్టర్ కు ప్రభాస్ ఓకే చెప్పాడూ … అంటే ఆమె వద్ద ఉన్న స్టోరీ ఎంతగా ఆయనకు నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కాని కొందరు మాత్రం బాబోయ్ వద్దు అంటూ ఆ సినిమా ను మొదటి నుండే తిరష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. సౌత్ తో పాటు నార్త్ లో విశేషంగా అభిమానులను దక్కించుకున్న ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ల సంఖ్య భారీగానే ఉంది.బాలీవుడ్ కోసం కోలీవుడ్ టాలీవుడ్ కన్నడ సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు ఆయనతో వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. మరి ప్రభాస్ అభిమానుల మాట వింటాడా… మనసు మాట వింటాడా… కాలమే తీర్చాలి ఈ సందేహాన్ని.