Prabhas: టాలీవుడ్ రారాజు కృష్ణంరాజు గత ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో అభిమానులు, జనం హాజరయ్యారు. ఇక, శనివారం కృష్ణంరాజు దిన కర్మ జరగనుంది. కృష్ణంరాజు సొంతూరులో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్దనాన్న దిన కర్మకు ప్రభాస్ హాజరవుతున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు వెళుతున్నారు. కృష్ణంరాజు దిన కర్మ సందర్భంగా పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉంది.
దాదాపు లక్ష మందికి భోజనాలు పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో జనం కార్యక్రమం జరిగే చోటుకు చేరుకున్నారు. రెబల్ స్టార్ ఇంటివద్ద ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన మిత్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, కృష్ణంరాజు మరణంతో ఆయన కుటుంబానికి తేరుకోలేని దెబ్బ తగిలింది. భర్తపై పంచ ప్రాణాలు పెట్టుకున్న శ్యామలా దేవి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు ఇంటికి వెళుతున్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలయజేస్తున్నారు.
నిన్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయన ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు కుటుంబంతో మాట్లాడారు. తన సానుభూతి వ్యక్తం చేశారు. ఈ రోజు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, సునీల్, రవితేజల మాతృమూర్తులు కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. శ్యామలా దేవితో మాట్లాడారు. ఇక, కర్ణాటక మంత్రి శ్రీరాములు కూడా కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. తన సానుభూతి తెలియజేశారు. మరి, కృష్ణంరాజు దిన కర్మకు లక్ష మందికి భోజనాలు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kangana Ranaut: రాముడు, కృష్ణుడు, గాంధీల్లాగా.. మోదీ అవతార పురుషుడు: కంగనా రనౌత్