అభిమానుల చేత రెబల్ స్టార్‌గా పిలిపించుకున్న కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గత కొంత కాలంగా చిక్సిత తీసుకుంటున్న కృష్ణంరాజు.. ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. ఆయన మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. కృష్ణంరాజు కన్నుమూశారనే వార్త తెలియగానే సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇక కృష్ణంరాజు మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు.. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తీవ్ర సంతాపం తెలిపారు. తమ అభిమాన హీరోను ఆఖరిసారి చూసుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున కృష్ణంరాజు నివాసానికి తరలి వస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజుకు ఎంతో ఇష్టమైన ఫామ్ హౌస్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇక పెదనాన్న మృతితో ప్రభాస్ తీవ్రంగా కుంగిపోయాడు. ఆయనను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఎందుకంటే ప్రభాస్‌ను సొంత కొడుకు కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు ప్రభాస్. ఆయనకు కుమారులు లేకపోవడంతో.. ప్రభాస్‌ను తన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ప్రభాస్ వెన్నంటి ఉంటూ.. కెరీర్‌పరంగా తగిన సలహాలు, సూచనలు ఇస్తూ.. అండగా నిలిచారు. నేడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఇంత గుర్తింపు, ఆదరణ, అభిమానం సొంతం చేసుకున్నారంటే దాని వెనక కృష్ణంరాజు పాత్ర ఎంతో ఉంది. తండ్రి కొడుకులను మించిన అనుబంధం వారి మధ్యన ఉందంటారు సన్నిహితులు.
ఇక కృష్ణంరాజు మృతి వార్తను ప్రభాస్ జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ కృష్ణంరాజు వారసుడిగా ఆయన అంత్యక్రియలకు సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో పెదనాన్నతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు ప్రభాస్. ఆయనను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇక ఎంతో ధైర్యశాలిగా కనిపించే ప్రభాస్.. ఇలా కన్నీరు పెట్టడం చూసి ఆయన అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ధైర్యంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Never in my wildest dreams, I thought I would see him like this 😭
This feels so personal 💔Stay strong #Prabhas anna 🥺😭 pic.twitter.com/k1Jgy82947
— SALAAR 🏹 (@bhanurockz45) September 11, 2022