ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమాలోనే అత్యధిక పారితోషకం అందుకునే నటుడు ప్రభాస్. చేతిలో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-K వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. అయితే ఆదిపురుష్ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.
అయితే మరి అంత అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్న ఓం రౌత్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. అది కూడా అంతా ఇంతా ఓరెంజ్‌లో సోషల్ మీడియాలో ఎక్కేస్తున్నారు. అయితే ఓం రౌత్ ఏం చేశాడా అనే అనుమానం రావచ్చు. ఆయన ఏం చేయలేదు అందుకే ఫ్యాన్స్ అలా ట్రోల్ చేస్తున్నారు. సినిమా అనౌన్స్ చేయడం, షూటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతున్న సమయంలో 2020లో ఆదిపురుష్‌కు ఒక రిలీజ్ డేట్ ఇచ్చారు.
ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ విషయంలోనే అంతా రచ్చ నడుస్తోంది. ఆగస్టు 11, 2022లో రిలీజ్ అంటూ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఇప్పుడు అంతా ఆ పోస్టర్‌ను షేర్ చేస్తూ కామెంట్లు, సెటైర్లు, మీమ్లు అబ్బో అంతా ఇంతా కాదు ఆడేసుకుంటున్నారు. కొందరైతే నాకు టికెట్లు దొరకడం లేదని, ఇంకొందరు నాకు దొరికాయని కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు నెట్టింట ఇదే హాట్ టాపిక్ అయ్యింది.
అయితే అభిమానులు అంత సీరియస్ అవ్వడానికి గల కారణం ఏంటంటే.. ఎప్పుడే ప్రకటించిన రిలీజ్ డేట్ కూడా వచ్చింది. కానీ, ఇప్పటికీ ఆ సినిమాకి సంబంధించి ప్రభాస్ లుక్ గానీ, పోస్టర్ గానీ, మోషన్ పోస్టర్, టీజర్‌లాంటివి ఏమీ రిలీజ్ చేయక పోవడమే ఈ ఆగ్రహానికి కారణం. ఏమయ్యా కనీసం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేకపోయావా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇంక మీమర్స్ అయితే నెక్ట్స్ లెవల్లో ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమాని 2023, జనవరి 12లో విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అభిమానులు ఆ డేట్ పై కూడా అంత నమ్మకం లేదంటున్నారు. మరి ఈ ట్రోలింగ్ చూసైనా మేకర్స్ సినిమా నుంచి అప్ డేట్ ఇస్తారేమో చూడాలి. ఓం రౌత్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.