హీరోయిన్ త్రిష.. ఈ పేరు చెప్పగానే ఇప్పుడు కుర్రాళ్లంతా గతంలోకి వెళ్లిపోయారు. తమ స్కూల్ డేస్ క్రష్ ఈమె అని చెబుతూ తెగ మురిసిపోతారు. ఎందుకంటే త్రిష ఎవర్ గ్రీన్ బ్యూటీ. ‘వర్షం’ సినిమాలో త్రిష క్యూట్ నెస్, ఆ డ్యాన్స్ గుర్తొస్తే చాలు తెగ మురిసిపోతుంటారు. అయితే ‘వర్షం’ సినిమాని థియేటర్లలో రీ రిలీజ్ చేయగా, ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే త్రిష చేసిన ఓ పని మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ కోపం తెప్పించింది. ఇప్పుడు ఆ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. గత కొన్నాళ్లలో తెలుగు హిట్ సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. మహేశ్ ‘పోకిరి’తో మొదలైన మేనియా.. ఇప్పటికీ నడుస్తూనే ఉంది. స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆయా కథానాయకుల హిట్ సినిమాలు రిలీజ్ చేశారు. ఇకపోతే అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘బిల్లా’ రీ రిలీజ్ చేశారు. దానికి ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక డార్లింగ్ హీరో ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘వర్షం’ 4k ప్రింట్ ని మరోసారి థియేటర్లలో ప్రదర్శించారు.
అయితే ఈ క్రమంలోనే హీరోయిన్ త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నేను యాక్ట్ చేసిన తొలి చిత్రం 18 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయింది. నిన్ననే ఈ సినిమా రిలీజైనట్లు ఉంది. సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో ఉండిపోతాయని చెప్పడానికి ఈ వీడియోనే ఎగ్జాంపుల్. మళ్లీ చెబుతున్నా.. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈ వీడియో చూశాక నా మనసు పూర్తిగా సంతోషంతో నిండిపోయింది’ అని త్రిష ఓ వీడియో పోస్ట్ చేసింది. అయితే దీన్ని చూసిన పలువురు డార్లింగ్ ఫ్యాన్స్.. ‘ప్రభాస్ గురించి, మూవీ టీమ్ గురించి రెండు ముక్కులు మాట్లాడితే ఏం పోయింది. నీ సెల్ఫా డబ్బా నువ్వు కొట్టుకోవడం ఏంటి, అయినా నీకు అంత సీన్ లేదు’ అని త్రిష గాలి మొత్తం తీసేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదికాస్త చర్చనీయాంశంగా మారింది.
18 years later…A re-release…My first Telugu film…Still feels like yesterday…🥹
Just goes to prove “Films are forever” and I repeat for the 9456743 time “I AM because of you all”#myheartisfull #varsham ❤️ pic.twitter.com/bNdE8ZVQAA— Kundavai (@trishtrashers) November 12, 2022