Bandla Ganesh: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన కొత్త చిత్రం ‘చోర్ బజార్’. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి బండ్ల గణేష్ హాజరై మరోసారి తన స్టైల్ లో స్పీచ్ ఇచ్చాడు. ప్రస్తుతం బండ్ల మాటలు పెద్ద దుమారానికి తెరలేపినట్లు తెలుస్తోంది. బండ్ల మాటలపై పాన్ ఇండియా స్టార్ హీరో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇంతకీ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఏవంటే.. “పూరి జగన్నాథ్ ఎందర్నో స్టార్లని.. సూపర్ స్టార్లని చేశాడు. డైలాగులు రానోళ్లకి డైలాగులు నేర్పించాడు, డ్యాన్స్ లు రానివాళ్ళకి డాన్సులు నేర్పించాడు. మాములు వాళ్ళని కూడా స్టార్లని చేశాడు. కానీ, కన్న కొడుకు సినిమా వచ్చేసరికి ఎక్కడికో ముంబై వెళ్లి కూర్చున్నాడు. పూరి చేతిరాత వల్ల స్టార్లయ్యి వందల కోట్లు తీసుకుంటున్న స్టార్ హీరోలు వచ్చి.. పూరి కొడుకు సినిమాను ప్రమోట్ చేస్తారనుకున్నాను.
పూరితో సినిమా చేసినప్పుడు ఆకాష్ ని జో కొట్టిన వాళ్లంతా సినిమాల్లో బిజీగా ఉండి రారు ఇక్కడికి. అది వాళ్ళ బిజీ. మళ్ళీ వీడు స్టార్ అయితే వాళ్ళకి ఇబ్బంది’ అని చెప్పుకొచ్చాడు. అయితే.. ఇండస్ట్రీలో రూ.100 కోట్లకి దరిదాపుల్లో పారితోషికం తీసుకుంటున్న హీరో డార్లింగ్ ప్రభాస్ తప్ప వేరెవరూ లేరు. బండ్ల గణేష్ కావాలని ప్రభాస్ ని టార్గెట్ చేసి అలాంటి మాటలు అన్నాడని ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
ఇక ప్రభాస్ ని స్టార్ చేసింది పూరి కాదని.. రెండు సినిమాలు చేస్తే అందులో ఒకటి యావరేజ్, ఇంకోటి ప్లాప్ అని కామెంట్స్ చేస్తున్నారు. అయినా పాన్ ఇండియా స్టార్ అయ్యాక.. ఆకాష్ నటించిన ‘రొమాంటిక్’ సినిమాని దగ్గరుండి ప్రమోట్ చేశాడు. తన బిజీ షెడ్యూల్ లో ఒక రోజంతా ఆకాష్ కోసం కేటాయించాడు. ఇవన్నీ తెలుసుకోకుండా అలా ఎలా కామెంట్స్ చేస్తావ్ అంటూ బండ్ల గణేష్ పై డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి బండ్ల గణేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
ఇదీ చదవండి: పూరీ జగన్నాథ్ చుట్టూ ర్యాంప్ లు, వ్యాంప్ లు మధ్యలో వచ్చారు: బండ్ల గణేష్!