తెలుగు ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగా అంతా ఇంతా కాదు. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు ప్రభాస్. అయితే తాను నటించబోయే చిత్రాలు పెద్ద ప్రాజెక్ట్స్ కావడంతో, ఎక్కువ టైమ్ తీసుకోవడం సహజం.. అయితే ప్రభాస్ నటించిన ‘సాహో’ వచ్చి రెండేళ్లు దాటుతుంది.
రెండున్న క్రితం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’చిత్రం మొదలైంది. కానీ ఈ చిత్రానికి సంబంధించిన ఏ ఒక్క అప్ డేట్ బయటకు రాలేదు. షూటింగ్ జరుగుతున్న సమయంలో కరోనా ప్రభావంతో షూటింగ్స్ వాయిదా పడటం జరిగింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదాలు పడటం.. షూటింగ్ లేట్ కావడం జరుగుతూ వచ్చింది. అయితే అప్పడప్పుడు పోస్టర్స్ తప్ప ఈ మూవీకి సంబంధించిన పెద్దగా అప్ డేట్స్ లేవు. ఈ మద్య టీజర్ రిలీజ్ చేశారు. మిగిలిన హీరోలంతా వెంటవెంటనే అప్ డేట్స్ ఇస్తుంటే ప్రభాస్ నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. ఒక రకంగా ప్రభాస్ తో సినిమా తీసే దర్శక నిర్మాతలు ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. తాజాగా ఓ అభిమాని రాధే శ్యామ్ చిత్ర యూనిట్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ ప్రభాస్ అభిమాని ‘రాధేశ్యామ్’ నుంచి ఎలాంటి అప్డేట్ లేదని ఆత్మహత్య లేఖ రాసి ట్విట్టర్లో పెట్టి ‘రాధేశ్యామ్’ నిర్మాతలు యూవీ క్రియేషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ ను ట్యాగ్ చేశారు.
‘‘ఇంతవరకు ఒక్క లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా ఊహించలేదు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా ‘రాధేశ్యామ్’ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్. నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్” అని ఆ లెటర్ లో చాలా ఎమోషనల్ గా రాశాడు ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్. అయితే ఈ లెటర్ సినిమా టీం వరకు వెళ్లిందో లేదో తెలీదు కానీ ప్రభాస్ ఫాన్స్ మాత్రం ఈ లెటర్ ని షేర్ చేస్తున్నారు. మరోవైపు ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని జనవరి 14వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
@UV_Creations @director_radhaa #RadheShyam #Prabhas ఈ లెటర్ రాసింది ఒక రెబెల్ స్టార్ fan అయ్యినా కానీ ప్రతీ యొక్క రెబెల్ స్టార్ ఆవేదన అది అని అర్ధం చేసుకోండి @director_radhaa @UV_Creations 🙏 pic.twitter.com/j2KyqoESXo
— Vamsi (@Vamsi48324621) November 11, 2021