పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు ప్రస్తుతం సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్.. వరుస బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా మార్చి 11న విడుదలకు రెడీ అవుతోంది. ఇక సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
ఇటీవలే ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే‘ షూటింగ్ ప్రారంభించాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోనె హీరోయిన్ గా నటిస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇదివరకే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘ప్రాజెక్ట్ కే’ మూవీ.. సెకండ్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. అయితే.. తాజాగా ప్రభాస్ – అమితాబ్ ల మధ్య సీన్స్ షూట్ చేశారు మేకర్స్.
ఇదిలా ఉండగా.. అమితాబ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పై ఎమోషనల్ అయిన ప్రభాస్.. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని బయటపెట్టాడు. అమితాబ్ త్రోబాక్ పిక్ షేర్ చేస్తూ.. ‘నా చిరకాల కల నిజమైంది. లెజెండరీ అమితాబ్‌బచ్చన్ సర్‌తో ప్రాజెక్ట్ కే ఫస్ట్ షాట్‌ను కంప్లీట్ చేశాను’ అంటూ ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి ప్రభాస్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.