జనవరి 11న డార్లింగ్ ప్రభాస్- పూజా హెగ్దే ప్రధాన పాత్రల్లో నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో తలమునకలై ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అన్ని ప్రెస్ ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఆ సమయంలో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను ప్రభాస్ షేర్ చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే తాజాగా ఓ షూటింగ్ లో తనను నిజమైన కర్రతో కొట్టారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అయితే అది ఇప్పటి సంగతి కాదు. ఛత్రపతి సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను ప్రభాస్ ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు సూరీడుని కాట్ రాజ్ కొట్టి గీతలో పడేస్తాడు ఆ సమయంలో హీరోకి విలన్ కి మధ్య జరిగే ఫైట్ సినిమా మొత్తానికి హైలెట్ అని చెప్పాలి. ఆ సమయంలో సముద్రం దగ్గర కాట్ రాజ్ ప్రభాస్ ను ఓ కట్టెతో కొడతాడు. అయితే అక్కడ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ నిజమైన కట్టెను వాడారు. అంటే రియాలిటీకి చాలా దగ్గరగా ఉండేలా ఆ కర్రను తయారు చేశారు.
తనని కొట్టే వరకు కూడా అది అంత గట్టిగా ఉండే కర్ర అని ప్రభాస్ కు కూడా తెలియదు. ఆ సమయంలో ప్రభాస్ కు నిజంగానే వీపు వాచిపోయిందని చెప్పుకొచ్చాడు. అలా ఎందుకు చేశారని రవీందర్ ను ప్రశ్నిస్తే.. పర్ఫెక్షన్ కోసం అలా చేసినట్లు చెప్పారంట. కానీ, ప్రభాస్ కెరీర్ లో అతనికి మంచి మాస్ ఫాలోయింగ్, స్టార్డమ్ వచ్చింది ఛత్రపతి సినిమా నుంచే అని డౌట్ లేకుండా చెప్పవచ్చు. ప్రభాస్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.