ఈ సంక్రాంతికి ఎన్నడూ లేని విధంగా రెండు పోట్ల గిత్తలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. సంక్రాంతి పందెం కోళ్లలా బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి. అయితే ఈ పందెంలో రెండు గిత్తలు, రెండు పందెం కోళ్లు సక్సెస్ అయ్యాయి. ఆ పోట్ల గిత్తలు, పందెం కోళ్లు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణనే. ఈ ఇద్దరూ ఎకో ఫ్రెండ్లీ నేచర్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు అంటే ఆ మాత్రం వేడి ఉంటుంది. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు రావడం రావడంతోనే సంక్రాంతి పండగని తీసుకొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో వీరి సినిమాలతోనే సంక్రాంతి పండగ జరుపుకుంటున్నారు.
వాల్తేరు వీరయ్య మెగా మాస్ సినిమాగా దూసుకుపోతుంటే.. వీర సింహారెడ్డి మాస్ మెంటల్ సినిమాగా దూసుకుపోతుంది. రెండు సినిమాలు పోటాపోటీగా ఆడుతున్నాయి. ఈ సినిమాలు చూడ్డానికి అభిమానులు, ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్లైన ప్రభాస్, అల్లు అర్జున్ లు కూడా హీరోల సినిమాలు చూసేందుకు థియేటర్ కి వచ్చారు. ఏఎంబీ సినిమాస్ లో ప్రభాస్ వీర సింహారెడ్డి సినిమా చూడగా.. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో అల్లు అర్జున్ వాల్తేరు వీరయ్య సినిమా చూశారు. అల్లు అర్జున్ మెగాస్టార్ కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఒక నిజమైన అభిమాని.. చిరంజీవి సినిమా చూశారని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక రీసెంట్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి వెళ్లిన ప్రభాస్.. బాలకృష్ణకు వీరాభిమాని అయిపోయారు. బాలకృష్ణ కూడా ఫోన్ చేసి సినిమా చూడమని చెప్పే ఉంటారు. కాబట్టి ప్రభాస్.. వీర సింహారెడ్డి సినిమాని చూసేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని ప్రభాస్ టీమ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రభాస్ వీర సింహారెడ్డి సినిమా చూస్తున్నారని శుక్రవారం రాత్రి 9 గంటలకు ట్వీట్ పెట్టింది. డార్లింగ్ సెకండ్ షోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ వాల్తేరు వీరయ్య సినిమా ఫస్ట్ షోకి వెళ్లారు. మొత్తానికి ఇటు ప్రభాస్, అటు అల్లు అర్జున్ తమ అభిమాన హీరోల సినిమాలు చూడ్డానికి థియేటర్ కి వెళ్లడం పట్ల అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. మరి అల్లు అర్జున్, ప్రభాస్ ఇరు హీరోల సినిమాలు చూడడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Icon StAAr @alluarjun watching his hardcore Mega Star @KChiruTweets fan movie #WaltairVeerayya 😍🔥#AlluArjun #Chiranjeevi #MegaStarChiranjeevi #Chiranjeevi pic.twitter.com/Mg0FPCtdTr
— Nithin (@NithinPSPKCult) January 13, 2023
#Prabhas watching #VeeraSimhaReddy now 🔥🔥🔥
— Team PRABHAS (@TeamPrabhasOffl) January 13, 2023