డార్లింగ్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆదిపురుష్’కు అన్నీ కలిసొస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ రోజుల్లో సినిమాలు తీయడం ఒక లెక్కయితే వాటికి ప్రమోషన్ మరో లెక్క అనేలా ఉంది. కొన్నాళ్ల కింద వరకు టీజర్, ట్రైలర్‌తోనే సినిమాలపై బజ్ ఏర్పడేది. కానీ ఇప్పుడు ప్రమోషన్స్‌ను బట్టి కూడా మూవీస్‌పై హైప్ పెరుగుతోంది. ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా రావాలంటే సినిమా మీద మంచి బజ్ ఏర్పడాలి. అదే సమయంలో ఎక్కువ థియేటర్లు దొరకాలి. ఇవన్నీ కుదిరి, మార్కెట్లో పెద్దగా పోటీ లేకపోతే వసూళ్ల పండుగ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా పరిస్థితి ఇలాగే ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం టీజర్‌పై నెగెటివ్ ట్రోల్స్ వినిపించాయి. అయితే ట్రైలర్ విడుదలతో అంతా మారిపోయింది. మంచి పాజిటివ్ బజ్‌తో రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘ఆదిపురుష్’కు అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి. ఈ మూవీ ముందు అనుకున్నట్లు సంక్రాంతికి విడుదలైతే ఏమై ఉండేదో చెప్పలేం. కానీ ఇప్పుడు మాత్రం ఫిల్మ్‌కు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
సమ్మర్లో పెద్ద సినిమా లేక ఆడియెన్స్ కరవులో ఉన్నారు. దీనికి తోడు ‘ఆదిపురుష్’ రిలీజ్‌కు ముందు వరకు బాక్సాఫీస్ వద్ద స్తబ్దత కనిపిస్తోంది. ఈ మూవీ రిలీజ్‌కు వారం ముందు వస్తున్న ‘టక్కర్’, ‘విమానం’ సినిమాలపై పెద్దగా అంచనాలు లేవు. ఆడియెన్స్ దృష్టి మొత్తం ‘ఆదిపురుష్’ మీదే కేంద్రీకృతమై ఉంది. ఈ సినిమా విడుదలయ్యే వారాంతంలో తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ చెప్పుకోదగ్గ రిలీజ్లు లేవు. ఆ తర్వాతి వారమూ పెద్దగా పోటీ ఉండే ఛాన్స్ కనిపించడం లేదు. జూన్ చివర్లో నిఖిల్ ‘స్పై’ మోస్తరు అంచనాలతో రాబోతోంది. అప్పటిదాకా ‘ఆదిపురుష్’ నిలబడితే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించొచ్చు. మొత్తంగా చెప్పాలంటే.. ఇటు ఆడియెన్స్ మూడ్, అటు బాక్సాఫీస్ పరిస్థితులు ‘ఆదిపురుష్’కు పూర్తి అనుకూలంగా ఉన్నాయనేది స్పష్టం. దీంతో ఇండియన్ బాక్సాఫీస్‌ను ప్రభాస్‌కు రాసిచ్చారా అనేలా ఉంది. ఔట్పుట్ బాగుంటే వసూళ్లలో ఈ చిత్రం కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం.