ఇండస్ట్రీలో హీరోగా ఒక్క సినిమా కూడా చేయకుండానే భారీ హైప్ రావడం అనేది అందరి విషయాలలో జరగదు. అందులోను కేవలం సినిమా అనౌన్స్ మెంట్ దగ్గరనుండే డెబ్యూ చేయనున్న హీరో పేరు ట్రెండింగ్ లోకి రావడమంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎందరో హీరోలు డెబ్యూ చేయడం చూస్తున్నాం. అందులోను స్టార్ హీరోల తనయులు డెబ్యూ చేసినా, దగ్గరుండి స్టార్లే ప్రమోట్ చేసినా పెద్దగా బజ్ క్రియేట్ అవ్వని సందర్భాలు కూడా చూశాం. కానీ.. స్టార్ హీరోల తనయులకే సాధ్యంగాని క్రేజ్, బజ్ ని సొంతం చేసుకున్నాడు సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.
ఇరవై రెండేళ్ల చంద్రహాస్.. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా సినిమాల్లోకి హీరోగా డెబ్యూ చేయనున్నట్లు ప్రకటించాడు. ఎలాగో కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాం కదా! అని ప్రభాకర్ కూడా చంద్రహాస్ బర్త్ డేని ప్రెస్ మీట్ లో జరిపించాడు. అయితే.. చంద్రహాస్ హీరోగా ఇండస్ట్రీలోకి వస్తానంటున్నాడు.. సినిమా అనౌన్స్ చేశాడు.. అంతవరకు బాగానే ఉంది. కానీ.. ప్రెస్ మీట్ లో అతని యాటిట్యూడ్ ఏంటి? ఓవైపు పేరెంట్స్ మాట్లాడుతుంటే అతని వాలకం ఏంటి? అలా మీడియా ముందే ఇంట్లో బిహేవ్ చేసినట్లుగా చేయడమేంటి? అని పలు విధాలుగా చంద్రహాస్ పై ట్రోల్స్ తో విరుచుకుపడ్డారు మీమర్స్.
ఈ క్రమంలో డెబ్యూ మూవీ అనౌన్స్ మెంట్ కే చంద్రహాస్ పేరు మార్మోగిపోయేసరికి.. ఇవన్నీ చంద్రహాస్ కెరీర్ కి ఉపయోగపడేవేనా అనే అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. అయితే.. ప్రెస్ మీట్ లో చంద్రహాస్ అలా బిహేవ్ చేయడం వెనుక ప్రత్యేక కారణం ఏమి లేకపోగా.. మొదటి నుండి అతని యాటిట్యూడ్ అంతేనంటూ కొందరి అభిప్రాయం. అదీగాక చంద్రహాస్ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ పెర్ఫార్మన్స్ తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. హీరో కటౌట్ గురించి పక్కనపెడితే.. మొత్తానికి చంద్రహాస్ హీరోగా డెబ్యూకి సిద్ధమైపోయాడు. ఈ నేపథ్యంలో చంద్రహాస్ కి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. చంద్రహాస్ మొదటి సినిమా షూటింగ్ కి సంబంధించి సన్నివేశాలు అందులో ఉన్నాయి. చంద్రహాస్ తో పాటు సినిమా హీరోయిన్ కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే.. ఈ వీడియోలో చంద్రహాస్ షూటింగ్ సన్నివేశాలే కాకుండా అతనిలోని డిఫరెంట్ యాక్టింగ్ యాంగిల్స్, టాలెంట్ చూడొచ్చని కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. కానీ.. ఆఖరికి ఈ వీడియోని కూడా కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తూ హైలెట్ చేయడం సోషల్ మీడియాలో చూడవచ్చు. మొత్తానికి ట్రోల్స్ తోనే హీరోల రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంటున్నాడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్. మరి చంద్రహాస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.