ఇండస్ట్రీలో కొత్తవాళ్ళు హీరోలుగా డెబ్యూ చేయడం అనేది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కొందరు సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వస్తుంటారు. మరికొందరు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి నటులుగా ప్రూవ్ చేసుకుంటారు. అయితే.. ఎవరు ఎలా వచ్చినా హీరోలుగా నిలదొక్కుకోవాలంటే లుక్ ఒక్కటే సరిపోదు. అలాగని తమకు తాము హీరో అని ప్రచారం చేసుకున్న అయిపోలేరు. హీరో లుక్ ఉన్నా నటుడిగా పూర్తిస్థాయిలో టాలెంట్ ఉండాలని ఎన్నో సందర్భాలలో, ఎంతోమంది ప్రూవ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి సినీ బ్యాక్ గ్రౌండ్ తో 22 ఏళ్ళ చంద్రహాస్ హీరోగా డెబ్యూకి రెడీ అయిపోయాడు.
చంద్రహాస్ పేరు ఆల్రెడీ గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. మరి ఈ చంద్రహాస్ ఎవరి తాలూకా అని అంటారా.. ప్రముఖ సీరియల్ నటుడు, సినీ దర్శకుడు ప్రభాకర్ తనయుడే ఈ చంద్రహాస్. ఇటీవల చంద్రహాస్ 22వ బర్త్ డే సందర్భంగా ప్రభాకర్ ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడంటూ అనౌన్స్ చేశాడు. అంతేగాక మొదటి సినిమాకు ముందే ఓ కవర్ సాంగ్ చూసి.. మరో రెండు సినిమాలు అధికారికంగా ఓకే అయ్యాయని చెప్పడం విశేషం. దీంతో ఒక్కసారిగా అటు నెటిజెన్స్ కి, ఇటు సోషల్ మీడియా మీమర్స్ కి హాట్ టాపిక్ గా మారిపోయాడు చంద్రహాస్.
ఇక చంద్రహాస్ విషయానికి వస్తే.. ఇంట్రడక్షన్ స్పీచ్ లోనే నెటిజన్స్ అటెన్షన్ దక్కించుకున్నాడు. కాకపోతే.. హీరోగా కంటే చంద్రహాస్ గురించి కామెడీనే ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు జనాలు. డాన్స్ లో టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్న చంద్రహాస్.. చిన్నప్పటి నుండి హైపర్ యాక్టీవ్ అని చెప్పారు పేరెంట్స్. వాళ్ళు చెప్పినట్లుగానే ప్రెస్ మీట్ లో హైపర్ యాక్టీవ్ గా కనిపించి ట్రోలర్స్ కి హాట్ టాపిక్ లా మారాడు చంద్రహాస్. అయితే.. తాజాగా చంద్రహాస్ కి సంబంధించి పాత వీడియోలు, కొత్త వీడియోలు అన్ని తెరపైకి వచ్చాయి. అందులో ఒకటి చంద్రహాస్ చిన్నప్పటి వీడియో బాగా ట్రెండ్ అవుతోంది. మరి చంద్రహాస్ చిన్నప్పటి నుండే చాలా యాక్టీవ్ అని వీడియో చూస్తే అర్థమవుతుంది. మరి చంద్రహాస్ చిన్నప్పటి వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.