రన్ రాజా రన్ సినిమాతో తనను తాను నిరూపించుకున్న డైరెక్టర్ సుజీత్. ఈ సినిమా సక్సెస్‌తో పాటు తన టేకింగ్ స్టైల్‌తో ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేశాడు. సాహో అంటూ ప్రభాస్‌లో మాస్ అండ్ క్లాస్ బయటకు తీసుకువచ్చాడు.
రన్ రాజా రన్ సినిమాతో తనను తాను నిరూపించుకున్న డైరెక్టర్ సుజీత్. ఈ సినిమా సక్సెస్‌తో పాటు తన టేకింగ్ స్టైల్‌తో ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేశాడు. సాహో అంటూ ప్రభాస్‌లో మాస్ అండ్ క్లాస్ బయటకు తీసుకువచ్చాడు. తెలుగు నాట యావరేజ్ అయినప్పటికీ బాలీవుడ్ అభిమానులు సూపర్బ్‌గా ఆదరించారు. కోట్ల వసూళ్లను కుమ్మరించారు. ఆ తర్వాత సైలెంట్ అయినా సుజీత్.. వయలెంట్‌గా వస్తానని చెప్పకనే చెప్పేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే అదృష్టాన్ని దక్కించుకున్నాడు యంగ్, టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ సుజీత్.
సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓజీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుపుకుంటుంది. ప్రస్తుతం మోస్ట్ ఎవటెడ్ మూవీగా మారిపోయింది. పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో గ్యాంగ్‍స్టర్ పాత్రను పవన్ పోషిస్తున్నారని టాక్. ఈ మూవీని డీవీవీ దానయ్య తెరకెక్కిస్తుండగా.. ఇందులో నటించబోయే నటీనటుల ఎంపిక కూడా ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ పక్కన ప్రియా అరుళ్ మోహన్ నటిస్తుండగా.. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మోస్ట్ టాలెంటెడ్ యంగ్ స్టార్ అర్జున్ దాస్ ఈ ప్రాజెక్టులో వచ్చి చేశారు.
అంతలోనే మరో అప్ డేట్ వార్త వచ్చింది. అప్పుడప్పుడు అంటూ మనల్ని పలకరించి పొగరు సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించిన శ్రియా రెడ్డి ఈ సినిమాలో భాగస్వామ్యం కానుందని అధికారిక పోస్టర్ విడుదలైంది. ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతుందని సమాచారం. ఇప్పుడు మరో మోస్ట్ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదే పవన్ కళ్యాణ్‌ను ఢీ కొట్టేందుకు పవర్ ప్యాక్ బాడీతో రాబోతున్నారు ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మీ. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. టాలీవుడ్‌లో ఇమ్రాన్ హష్మీకి ఇదే తొలి చిత్రం. ఇమ్రాన్ హష్మీ భీకరమైన లుక్‌తో ఉన్న పోస్టర్‌తో మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆయన విలన్ పాత్రలో నటించబోతున్నారు.
When we have the #OG, we should also have a badass who is powerful and striking… 🔥🔥🤙🏻
Presenting you all, the nemesis @EmraanHashmi! #FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/CmBBTFvSdR
— DVV Entertainment (@DVVMovies) June 15, 2023