పవన్ 50వ పుట్టినరోజు సందర్భంగా పవన్ సినిమా అప్‌డేట్స్‌తో తెగ సంబరపడిపోతున్నారు. వకీల్ సాబ్ నుంచి వస్తున్న వరుస అప్‌డేట్లు, టైటిల్ సాంగ్, రిలీజ్ డేట్‌లతో ఫ్యాన్సు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ తన 29వ సినిమాని డైరెక్టర్ సురేందర్‌రెడ్డితో చేయనున్నాడు.
ప్రొడక్షన్ నంబర్ 9 పేరుతో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఎస్‌ఆర్‌టీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టర్‌పై యథాకాలం.. తథా వ్యవహారం అంటూ రాసి ఉంది. అది టైటిలా లేక స్లోగన్ అన్నది క్లారిటీ ఇవ్వలేదు. పోస్టర్‌లో భాగ్యనగరం ఉంది. ఒక కార్నర్‌లో గన్ కూడా పెట్టారు. ఇక, భీమ్లానాయక్ నుంచి వచ్చిన టైటిల్ సాంగ్ అయితే యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. హరిహర వీరమ్లలు కూడా ఏప్రిల్ 29, 2022న థియేటర్లలోకి రానున్నట్లు క్రిష్ అప్‌డేట్ ఇచ్చాడు.