తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. మెగాహీరోల సినిమాలు ఏ మూవీ రిలీజ్ అయిన ఇక థియేటర్‌లో రచ్చ రచ్చే. దీని కోసం మెగా ఫ్యాన్స్ వారి అభిమానులు సినిమాలు కానీ వారి చిత్రాల అప్‌డెట్ కానీ ఏది వచ్చినా… దాని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి మెగా ఫ్యాన్స్ ఈ సారి కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
అసలు విషయమేంటంటే ? తాజాగా మెగా బ్రదర్ నాగబాబు మెగా బ్రదర్‌లు అందరూ ఒకే చోట ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ పోస్ట్ చేశాడు. ఇక ఈ పోటోలో అల్లు అర్జున్, సాయిథరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్‌తో తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. పోటో షేర్ చేస్తూ..మెగా హీరోలందరిలో కెల్లా మీరే యంగ్ అండ్ డైనమిక్‌గా కనిపిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు వచ్చిన జనరేషన్ హీరోలు కానీ, రాబోయే జనరేషన్‌లో హీరోలు కానీ ఎవరూ మిమ్మల్ని బీట్ చేయలేరు అన్నయ్యా అంటూ మెగాస్టార్ చిరంజీవి మిడిల్‌లో ఉండి రెండు వైపులా మెగా హీరోలు ఉన్న ఫొటోని నాగబాబు షేర్ చేశారు.
కానీ ఇక్కడి వరకు బాగానే ఉంది. మరో విషయం ఏంటంటే? మెగా హీరోలందరి ఫోటోలు ఉన్నా ఇందులో పవన్ కళ్యాణ్ ఫోటో మిస్ అయింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏంటీ సార్.. అందరి పోటోలు పెట్టి మా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం మర్చిపోయారు అని ఏడ్చినట్లు ఇమెజ్ పెట్టి కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్‌గా మారింది.