తెలుగు పాపులర్ రియాలిటీ షోలలో ఒకటి ఢీ షో. డాన్స్ షో అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ విషయంలో అందరిని ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ ఢీ షో పేరు వినగానే.. డాన్స్ కంటే ముందు యాంకర్ సుధీర్ – రష్మీల జంటనే గుర్తొస్తుంది. ఎందుకంటే.. సుధీర్ – రష్మీలే ఈ షోకి మెయిన్ ఎస్సెట్ అని చెప్పుకోవాలి. టీవీ ప్రేక్షకులు కూడా ఈ షోలో డాన్స్ చూడటం కంటే సుధీర్ – రష్మీల కెమిస్ట్రీ, కామెడీ చూసేందుకే ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తుంటారు.
ఎందుకో ఈ మధ్యకాలంలో సుధీర్ – రష్మీలను ఏ షోలో చూసినా ఇంతకుముందు కెమిస్ట్రీ కనిపించడం లేదు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఇదివరకు ఏ రేంజిలో కెమిస్ట్రీ ఉండేదో అందరికి తెలిసిందే. ఆ కెమిస్ట్రీ ఓ స్థాయికి చేరాక ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని టాక్ నడుస్తుంది.
దాదాపు 9 ఏళ్లుగా ఈ జంట ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. మరి సడన్ గా ఏమైందో గాని, వీరిద్దరూ ఇకపై ఢీ షోలో కనిపించబోరని లేటెస్ట్ ప్రోమో చూస్తే అర్ధమవుతుందని నెటిజన్లు చెప్తున్నారు. అందుకే ఢీ యాజమాన్యం కూడా సుధీర్ – రష్మీల స్థానంలో వేరే వాళ్ళను రీప్లేస్ చేసినట్లు తెలుస్తుంది. మరి దీన్నిబట్టి చూస్తే, ఇకపై సుధీర్ – రష్మీలు జంటగా కనిపించరేమో అనే వార్తలకు బలం చేకూరుతోంది. చూడాలి మరి ఈ జంట త్వరలో స్పందిస్తారేమో! ఈ ఫేమస్ జంట విడిపోవడం పై అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.