వినోద ప్రపంచంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పంజాబీ సింగర్ బల్వీందర్ సఫ్రీ కన్నుమూశారు. 63 సంవత్సరాల వయసు కలిగిన సఫ్రీ.. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన.. 86 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సఫ్రీ గుండె సంబంధిత సమస్య వలన ఆసుపత్రిలో చేరారట.
త్వరలోనే ఆయనను ట్రిపుల్ బైపాస్ కోసం పంపవలసి ఉంది. సర్జరీ పూర్తయింది కానీ ఆ తర్వాత ఆయన కోమాలోకి వెళ్లిపోయాడు. సిటి స్కాన్‌లో సఫ్రీ మెదడు దెబ్బతిన్నట్లు తేలింది. బల్వీందర్ సఫ్రీని భాంగ్రా స్టార్ అని కూడా పిలుస్తారు. సఫ్రీ పాడిన పాటలలో.. బోలి, బోలి బోలి, ఇక్ దిల్ కరే ఇప్పటికీ ప్రజల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. సఫ్రీ పాటలు పొలాల్లో రైతులు వింటూ ఉంటారు.
ఇదిలా ఉండగా.. సఫ్రీ మృతిపట్ల పంజాబీ సంగీత ప్రపంచం మూగబోయింది. ప్రముఖ సింగెర్స్ నీరూ బజ్వా, గురుదాస్ మాన్ మరియు జస్సీ గిల్ లాంటివారు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. మిమ్మల్ని మీ పాటలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం అని చెప్పారు. గురుదాస్ మాన్ అతన్ని సఫ్రీ సాహిబ్ అని పిలిచేవారు. ప్రస్తుతం సఫ్రీ మరణంపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మరి బల్విందర్ సఫ్రీ మృతిపట్ల మీ సంతాపాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.
What a sad day it is today. The Panjabi music industry has lost a gem. The UK Bhangra industry, one of it’s first and finest trailblazers. One of the most gifted and talented singers we had. Balwinder Safri was one of a kind 💔🙏🏽 pic.twitter.com/GcEiQOYLUo
— GKG (@GillysGuidance) July 26, 2022
Endless Classics! 😔🌹#RIP #BalwinderSafri 🕊 pic.twitter.com/eUUqvHsTVT
— Harpz Kaur (@HarpreetUK) July 26, 2022