గత కొంత కాలంగా సినిమా పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు నటీ, నటులు మరణించిన విషయం మనకు తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటుడు, రచయిత, పబ్లిసిటీ ఇంఛార్జ్ అనారోగ్య కారణాలతో మంగళవారం మరణించారు. ఈ వార్తతో ఇండస్ట్రీ మెుత్తం దిగ్భ్రాంతికి గురైంది.
గత కొంత కాలంగా సినిమా పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు నటీ, నటులు మరణించిన విషయం మనకు తెలిసిందే. కొత్త సంవత్సరం 3 నెలలు గడవక ముందే.. తారకరత్న, కె. విశ్వనాథ్, జమున, వాణీ జయరాం లతో పాటుగా ఇతర సినిమా పరిశ్రమలకు చెందిన మరికొంత మంది కన్నుమూశారు. ఇది పరిశ్రమకు తీరని లోటు. కాగా మరోసారి ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. హ్యారీ పోటర్ ఫేమ్ పాల్ గ్రాంట్ మరణించి 24 గంటలు గడవక ముందే.. టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటుడు, రచయిత, పబ్లిసిటీ ఇంఛార్జ్ వీరమాచినేని ప్రమోద్ కుమార్(87) అనారోగ్య కారణాలతో మంగళవారం మరణించారు. ఈ వార్తతో ఇండస్ట్రీ మెుత్తం దిగ్భ్రాంతికి గురైంది.
గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీని వరుస విషాదాలు కలవర పరుస్తున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, తారకరత్న, కె. విశ్వనాథ్, జమున ఇలా మరికొంత మంది మరణించి ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచారు. తాజాగా పాపులర్ నటుడు, రచయిత, నిర్మాత అయిన వీరమాచినేని ప్రమోద్ కుమార్ మంగళవారం(మార్చ్ 21)న అనారోగ్య కారణాలతో మరణించారు. 87 సంవత్సరాల ప్రమోద్ కుమార్ 38 సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమలో ఉన్నారు.
ఈ క్రమంలోనే ముఖ్యంగా పబ్లిసిటీ ఇంఛార్జ్ గా దాదాపు 300 చిత్రాలకు ఆయన పనిచేశారు. ఈ 300 సినిమాల్లో 31 సినిమాలు శతదినోత్సవ జరుపుకున్న చిత్రాలు ఉండటం విశేషం. నటుడిగా, నిర్మాతగా ఆయన టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తన సినిమా అనుభవాలను ‘తెర వెనుక తెలుగు సినిమా’ అనే పేరుతో ఆయన గ్రంథస్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది పురస్కారానికి ఎన్నికైంది. ఇక ప్రమోద్ కుమార్ మరణవార్తతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.