ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు లుథియానాలో చికిత్స పొందుతూ ఆదివారం ఆస్పత్రిలో మరణించారు. ఇంతకు ఆ నటుడు ఎవరంటే?
ఇండస్ట్రీలో గత కొన్ని రోజుల నుంచి తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు మరణిస్తూ కన్నీటిని మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఈ వరుస విషాద ఘటనలు మరువకముందే ప్రముఖ నటుడు కన్నమూశారు. క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆదివారం ఆస్పత్రిలోనే కన్నమూశారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇంతకు చనిపోయిన ఆ నటుడు ఎవరు? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.
బాలీవుడ్ ప్రముఖ నటుడు మంగళ్ ధిల్లాన్ గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఆయన గత కొన్ని రోజులు పంజాబ్ లోని లుథియాలనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో మంగళ్ ధిల్లాన్ ఆదివారం ఆస్పత్రిలోనే కన్నమూశారు. ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక మంగళ్ ధిల్లాన్ 1980లో కథాసాగర్ అనే టీవీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మెల్ల మెల్లగా చాలా సినిమాల్లో నటిస్తూ మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.