సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో మరణించడంతో ఆయన అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. ఆయన అంత్యక్రియలకు ప్రముఖ హీరో రజినీకాంత్ తో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఇది మరువక ముందే తాజాగా 30 ఏళ్లకే అస్సామీ నటుడు కూడా మరణించాడు. ఇదిలా ఉండగానే సోమవారం బెంగాలీ ప్రముఖ దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత తరుణ్ మజుందార్ ప్రాణాలు విడిచారు.
ఇది కూడా చదవండి: Kishor Das: క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన ప్రముఖ హీరో!
వయో సంబంధిత వ్యాధులతో బాధపడిన ఆయన ఇటీవల కోల్ కత్తాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కన్నుమూశారు. ఆయన మరణంతో బెంగాళీ చిత్ర పరిశ్రమలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే తరుణ్ దర్శకత్వంలో రూపొందిన కుహేలి, బాలిక వధు, దాదర్ కీర్తి లాంటి సినిమాలు ఎంతో ప్రాముఖ్యతను పోందాయి. తరుణ్ మజుందార్ తెరకెక్కించిన అనేక సినిమాలకు సైతం జాతీయ అవార్డు కూడా వరించడం విశేషం. ఇక ఇదే కాకుండా ఈ దర్శకుడికి 1990లో పద్మశ్రీ అవార్డు కూడా వరించింది. తరుణ్ మజుందార్ మరణవార్త తెలియడంతో చాలా మంది బెంగాలీ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బెంగాలీ ప్రముఖ దర్శకుడు తరుణ్ మజుందార్ మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.