చిత్రపరిశ్రమను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఇటీవల నటుడు విద్యాసాగర్ మరణవార్తను జీర్ణించుకునేలోపే మరో నటుడు ప్రదీప్ ముఖర్జీ ఇక లేరనే వార్త సినీ ప్రేక్షకులను విషాదానికి గురిచేస్తోంది. బెంగాలీ వెండితెరకు చెందిన సీనియర్ నటుడు ప్రదీప్ ముఖర్జీ.. సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. కాగా లెజెండ్ సత్యజిత్ రే తెరకెక్కించిన ‘జన అరణ్య’ సినిమాలో సోమనాథ్ పాత్ర ద్వారా నటుడిగా ఎనలేని గుర్తింపు సొంతం చేసుకున్నారు ముఖర్జీ.
ఇక ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ముఖర్జీ ఆగస్టు 22న ఆసుపత్రిలో చేరారు. ఆదివారం నుండి అతని పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్ పై చేర్చారు. గత రెండేళ్లలో ముఖర్జీకి రెండుసార్లు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. చివరిగా సోమవారం(ఆగష్టు 29న) ముఖర్జీ హాస్పిటల్ లోనే తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉండగా.. విద్యాబాలన్ ప్రధానపాత్రలో నటించిన ‘కహానీ 2’ సినిమాలో డాక్టర్ మైతీ పాత్ర పోషించి ప్రదీప్ ముఖర్జీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
నటనతో పాటు, ముఖర్జీ పన్ను సలహాదారుగా కూడా పనిచేసారు. ముఖర్జీకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1946లో ఆగస్టు 11న జన్మించిన ముఖర్జీ.. కోల్‌కతాలోని సిటీ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాక, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. కాలేజీ రోజుల నుండే నటన పట్ల ఆకర్షితుడైన ముఖర్జీ.. నాటక గురించి నేర్చుకోవడమే కాకుండా, ఎన్నో థియేటర్ అకాడమీలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ సత్యజిత్ రే ద్వారా అతను గుర్తించబడ్డాడు, అతను అతని ఐకానిక్ మూవీ ‘జన అరణ్య’లో సోమనాథ్‌గా కనిపించాడు. ప్రస్తుతం సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ముఖర్జీ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Someday I would love to write more on Jana Aranya. This is not Satyajit Ray’s finest, and I know people who believe the book is marginally better. But to speak of the defeated, the rejected takes extra effort. The meek, gentle hero made it believable. Pradip Mukherjee is no more. pic.twitter.com/Q8n7LKcEof
— Samanway Banerjee (@qriosam) August 29, 2022