శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు తెరపై కనిపించిన కేరళ ముద్దుగుమ్మ పూర్ణ. అయితే ఆమె హార్రర్ మూవీస్‌తో పేరు తెచ్చుకున్నారు. దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన అవును, అవును-2తో తెలుగు ప్రేక్షకులను భయపెట్టారు. సడన్ గా పెళ్లి చేసుకుని, బిడ్డని కని ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా
అందం, అభినయంతో కట్టిపడేసే నటీమణుల్లో ఒకరు పూర్ణ. శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ఈ కేరళ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అల్లరి నరేష్‌తో సీమ టపాకాయ్ సినిమా చేశారు. అయితే ఆమె హార్రర్ మూవీస్‌తో పేరు తెచ్చుకున్నారు. దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన అవును, అవును-2తో తెలుగు ప్రేక్షకులను భయపెట్టారు. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ సినిమాలు చేశారు. పవర్ ప్లే వంటి సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేసి ఔరా అనిపించారు. అటు సినిమాలు చేస్తూనే.. టీవీ షోల్లో కూడా సందడి చేశారు. అయితే ఊహించని విధంగా పెళ్లి చేసుకున్న ఆమె వెంటనే తాను ప్రెగ్నెంట్ అంటూ ఎన్సౌన్స్ చేశారు. ఆ తర్వాత బిడ్దకు కూడా జన్మనిచ్చారు.
గత ఏడాది పూర్ణ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త ఫహద్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి రహస్యంగా జరిగింది. అయితే పూర్ణ పెళ్లి అయిన వెంటనే గర్భవతి కావడంపై ప్రేక్షకులు పలు అనుమానాలు లేవనెత్తగా..ఆమె నివృత్తి చేశారు. సోషల్ మీడియా ద్వారా కూడా యాక్టివ్ గా ఉంటే పూర్ణ..ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటుంది. అలాగే తన ఫోటోలను షేర్ చేస్తోంది. ఆమె దుబాయ్‌లో డెలీవరీ అయ్యి పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగతి విదితమే. తాజాగా తన బాబు హమ్‌దూ ఫోటో రివీల్ చేస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. మదర్స్‌డేను పురస్కరించుకుని అభిమానులకు తన కొడుకును ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసింది పూర్ణ. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మాతృదినోత్సవం సందర్భంగా ఆమె పలు ఫోటోలు, వీడియోను పంచుకుంది. అందులో తన తల్లికి శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టు చేసింది పూర్ణ. మరో ఫోటోలో బాబు ఫోటోను షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మరో ఫోటోలో తన భర్త, కొడుకుతో ఉన్న ఫోటోను రివీల్ చేస్తూ.. అవర్ ప్రిన్స్ అంటూ పేర్కొన్నారు. ఈ ఫోటోలపై ఫ్యాన్స్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. పూర్ణ కొడుకును చూసిన అభిమానులు బాబు చాలా అందంగా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అచ్చు అమ్మ పోలికే అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, పూర్ణ ప్రస్తుతం కొత్త కొత్త క్యారెక్టర్లు చేసుకుంటూ దూసుకెళుతున్నారు. ఇటీవల విడుదలైన దసరా మూవీలో కనిపించిన సంగతి విదితమే.