తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. బుల్లితెరపై తిరుగులేని స్టార్డమ్ ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. ఈ షోకి మొన్నటివరకూ హోస్ట్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం సుధీర్ సినిమాలతో బిజీ అయిన కారణంగా హోస్ట్ గా యాంకర్ రష్మీ చేరింది. అయితే.. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షో ద్వారా టాలెంట్ ఉన్న కొత్తవాళ్లను పరిచయం చేస్తూ.. ఇన్స్పైరింగ్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఇక తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రోమో అంతా కూడా చాలా సరదాగా సాగినప్పటికీ, యాంకర్ రష్మీ, హైపర్ ఆది పంచులతో పాటు జడ్జిగా వచ్చిన పూర్ణ, కమెడియన్ ఇమ్మానుయేల్ మధ్య జరిగిన వివాదం హైలైట్ అయ్యింది. ఈ క్రమంలో స్టేజిపై పూర్ణ మాట్లాడుతుండగా.. వెనకనుండి ఇమ్మానుయేల్ ఆమె భుజంపై టచ్ చేశాడు. అంతే.. పూర్ణ ఒక్కసారిగా.. “ఏం చేస్తున్నావ్ నువ్? నన్ను అలా ఎలా టచ్ చేస్తావ్” అంటూ స్టేజి మీదనుండి వెళ్ళిపోయింది.
పూర్ణ మాటలకు ఇమ్మానుయేల్ తో పాటు షోలో ఉన్నవారంతా షాకయ్యారు. అలాగే అసలేం జరుగుతుందో అర్థం కాని స్థితిలో పూర్ణ వెళ్లిపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుతం జడ్జి పూర్ణ – ఇమ్మానుయేల్ మధ్య జరిగిన సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.