పూర్ణ.. నటిగా టాలీవుడ్ లో ఎంతో అభిమానులను సొంతం చేసుకుంది. తన అందం, అభినయం, డాన్స్ తో చలాకీ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. శ్రీమహాలక్ష్మీ, సీమ టపాకాయ్, అవును వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హారర్ సినిమాలు అంటే తప్పకుండా పూర్ణనే హీరోయిన్ గా ఉంటుంది అనేలా తన నటనతో మెప్పించింది. అయితే టాలీవుడ్ లో ఈ మలయాళీ భామకు ఆశించిన స్థానం దక్కలేదనే చెప్పాలి.
ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అమ్మడు.. ఈ మధ్యనే పెళ్లు చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. చేసుకోబోయే వాడిని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేసింది. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ఫౌండర్ అండ్ సీఈవో షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. నిన్న కేరళలో పూర్ణ-అసిఫ్ అలీ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను పూర్ణ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
“నేను నా ఈ ఫొటోలతో ప్రేమలో పడ్డాను. నా జీవితంలోని మధుర క్షణాలను క్యాప్చర్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ తో పూర్ణ ఫొటోలు, వీడియో తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పూర్ణ షేర్ చేసిన తన ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి.. ఆ వైరల్ ఫొటోలను మీరూ చూసేసి.. పూర్ణ- అసిఫ్ అలీలకు కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలను తెలియజేయండి.