సామ్-చైతు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు మీడియాలో కోడై కూసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ ఏనాడు కూడా వివరణ ఇచ్చిన పాపాన పోలేదు. ఇక ఎట్టకేలకు సుధీర్ఘ చర్చల అనంతరం ఇద్దరు విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యామని శనివారం నాగచైతన్య, సమంత తమ సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా తెలిపారు.
అవును మేము విడిపోతున్నామని, అభిమానులు అర్థం చేసుకోవాలని తెలిపారు. వివాహ బంధంతో విడిపోతున్నా భవిష్యత్ లో స్నేహితులతో కలిసే ఉంటామంటూ తెలిపారు. దీంతో సినీ నటులు ఒక్కొక్కరుగా వీరి విడాకులపై స్పందిస్తూ ఉన్నారు. శనివారం రాత్రి హీరో సిద్దార్థ్ సైతం వీరిద్దరి విడాకుల అంశంపై ట్విట్టర్ లో స్పందించారు.
నేను చిన్నప్పుడు స్కూల్ లో ఓ గుణపాఠం నేర్చుకున్నానని, మోసం చేసిన చీటర్స్ ఎప్పటికి బాగుపడలేరంటూ ఓ ట్విట్ చేశాడు. సిద్దార్థ్ చేసిన ట్విట్ ఖచ్చితంగా చైతు-సమంత విడాకుల గురుంచేనని టాలీవుడ్ వర్గాలు సైతం అనుకుంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే హీరో సిద్దార్థ్ చేసిన ట్విట్ ను రీట్విట్ చేస్తూ పూనమ్ కౌర్ ఇది ముమ్మాటికి కరెక్ట్ అంటూ సిద్దార్ధ్ కు మద్దతు ఇచ్చింది. ఇక పూనమ్ కౌర్ మద్దతు ఇవ్వటంపై టాలీవుడ్ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూనమ్ హీరో సిద్దార్థ్ కి మద్దతు ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
True that ! https://t.co/gTyAgD2l6t
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 2, 2021