సినీ ఇండస్ట్రీలో సినిమా వార్తలకంటే ఎక్కువగా వివాదాలలో నిలిచే తెలుగు హీరోయిన్లలో పూనమ్ కౌర్ ఒకరు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా కాంట్రవర్సీలలో భాగమవుతోంది. కాంట్రవర్సీ అనేది పూనమ్ కి కొత్త కాదు. దాదాపు 15 ఏళ్ళ క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ బ్యూటీ.. ఇప్పటివరకూ చాలా సినిమాలే చేసింది కానీ.. కెరీర్ పరంగా స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరలేకపోయింది. అయితే.. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
అక్కడ కూడా పూనమ్ కి సరైన క్రేజ్ దక్కలేదు. అనంతరం హిందీలోనూ ప్రయత్నించింది. ఇదిలా ఉండగా.. సినిమాలకంటే ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చింది వివాదాలే అని చెబుతున్నాయి సినీవర్గాలు. తెలుగులో దాదాపు నాలుగేళ్ళ తర్వాత నాతిచరామి అనే సినిమాతో మెరిసింది. ఆ సినిమాలో ఫుల్లుగా అందాలను ఆరబోసినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఆ విషయం పక్కన పెడితే.. పూనమ్ కౌర్ పేరు కనబడితే చాలు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనలోకి వస్తుంది.
ఈ విషయమై తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు పూనమ్ సెటైరికల్ గా సమాధానమిచ్చింది. అయితే.. పవన్ కళ్యాణ్ ని పూనమ్ ఎప్పుడు పొగిడినట్లుగాని, సెటైర్ వేసినట్లుగాని ఏది నేరుగా చెప్పకుండా ట్వీట్లు పెడుతుంటుంది. ఆమె చేసే ప్రతీ ట్వీట్‌లో #PKLOVE అని హ్యాష్ ట్యాగ్ ఉంటుంది. ఇక పీకే లవ్ అంటే.. అది పూనమ్ కౌరా? లేదా పవన్ కళ్యాణా? అని నెటిజన్లు కూడా సందేహపడుతుంటారు.
ఈ క్రమంలో తాజాగా ఈ విషయాన్ని ఓ నెటిజన్ స్ట్రెయిట్ గా అడిగేశాడు. “అంతా బాగానే ఉందిగానీ లాస్ట్ లో ‘పీకే లవ్’ అని ఉంది. అంటే ఏంటి అక్కా” అని అడిగాడు. దీనికి పూనమ్ కౌర్ తన స్టైల్లో కౌంటర్ వేస్తూ.. ‘ఏ కారణం లేకపోయినా మీరు నన్ను టీజ్ చేస్తుంటారు కదా? అయినా కూడా నేను ఇలానే చేస్తుంటాను అని అర్థం.. ఇప్పుడు అర్థమైందా తమ్ముడు? నన్ను కార్నర్ చేయడం అంత ఈజీ కాదు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూనమ్ కౌర్ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పూనమ్ కౌర్ ‘పీకే లవ్’ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
I will do more of what u tease me at for no reason ani , ardam ainda tammudu ? Cornering won’t work with me 😎
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 31, 2022