Pooja Hegde: సినీ ఇండస్ట్రీలో మోడలింగ్ నుండి సినిమాలవైపు అడుగులేసిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించి, ఎన్నో బ్యూటీ కాంపిటీషన్స్ లో పాల్గొన్న బ్యూటీలు సైతం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్స్ గా చక్రం తిప్పుతున్నారు. అలా మోడలింగ్ నుండి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ముంబై భామ పూజాహెగ్డే.
పూజా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా గ్లామర్ ప్రియులకు పూజా పేరు కొత్తకాదు. అయితే.. తెలుగు ప్రేక్షకులకు పూజా హెగ్డే అంటే హీరోయిన్ గా మాత్రమే తెలుసు. అసలు హీరోయిన్ కాకముందు పూజా ఏం చేసేదని ఎంతమందికి తెలుసు! ఇప్పుడంటే.. టీవీలలో, సినిమాలలో, యాడ్స్ లో ఆమెను చూస్తున్నారు. కానీ.. నటిగా కంటే ముందు పూజా పాపులర్ మోడల్ మాత్రమే.
టీనేజ్ లోనే మోడలింగ్ ప్రారంభించిన పూజా.. ‘ప్యాంటలూన్ ఫెమినా మిస్ ఇండియా 2009’లో మోడల్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాత 2010లో ‘ఐయామ్ షి.. మిస్ యూనివర్స్ ఇండియా’లో సెకండ్ రన్నరప్ గా నిలిచింది. అయితే.. మోడల్ గా కిరీటాలు అందుకోలేదుగాని నటిగా సౌత్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటోంది.
ఇక హీరోయిన్ కాకముందు ఎన్నో సోప్ యాడ్స్, ఫేస్ క్రీమ్ యాడ్స్ చేసిన పూజా.. 2009లో ఫెమినా మిస్ ఇండియా బ్యూటీ కాంపిటీషన్ లో పోటీ చేసింది. అప్పుడు పూజా వయసు 18 సంవత్సరాలు. అదీగాక అప్పుడు పూజా ఆడిషన్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లోనే పూజా బికినీ ధరించి ఆడిషన్ ఇచ్చింది. ఆ వీడియోలో టీనేజ్ పూజా గ్లామర్ ని ఆస్వాదిస్తున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉండగా.. 21 ఏళ్లకే మగమూడి అనే తమిళ సినిమాతో హీరోయిన్ అయినటువంటి పూజా.. ఆ తర్వాత 2014లో ఒక లైలాకోసం, ముకుంద సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక తెలుగులో వరుసగా దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత, మహర్షి, గడ్డలకొండ గణేష్, అల వైకుంఠపురంలో సినిమాలతో బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుంది. ఇటీవల ప్రభాస్ సరసన రాధేశ్యామ్, విజయ్ తో బీస్ట్, రాంచరణ్ తో ఆచార్య సినిమాలు నిరాశపరిచాయి.
ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు హిందీ, రెండు తెలుగు సినిమాలున్నాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండ సరసన జనగణమన కాగా, మరొకటి త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబో మూవీ. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇదివరకే మహేష్ తో మహర్షి, త్రివిక్రమ్ తో అరవింద సమేత, అల వైకుంఠపురంలో మూవీ చేసిన పూజా కొత్త మూవీకి ప్లస్ అవుతుందేమో చూడాలి. మరి పూజా హెగ్డే మోడలింగ్ ఆడిషన్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.