బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో ప్రేమ వ్యవహారంపై పూజా హెగ్డే మొదటి సారి మీడియా ముందు మాట్లాడారు. గత కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రచారంపై ఒకరకంగా క్లారిటీ ఇచ్చారు.
ప్రముఖ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, హీరోయిన్ పూజా హెగ్డేల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని.. వీరిద్దరూ గతకొద్ది నెలల నుంచి డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై పూజా హెగ్డే తాజాగా స్పందించారు. సల్మాన్‌తో ఆమె కలిసి నటించిన ‘ కిసి కా భాయ్ కిసి కా జాన్’ ప్రమోషన్లలో సల్మాన్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చారు. మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. ‘‘ నేను దాని గురించి ఏం చెప్పమంటారు? నేను నా గురించి చాలా రోజులనుంచి ఏదో ఒకటి చదువుతూనే ఉన్నాను. నేను సింగిల్‌ను.. నాతో నేను ప్రేమలో ఉన్నాను.
నేను మనస్ఫూర్తిగా నా కెరీర్ మీద శ్రద్ధ పెట్టాను. నేను ఒక సిటీ నుంచి మరొక సిటీకి గెంతుతూ ఉన్నాను. అదే నా ప్రస్తుత గోల్. నేను కూర్చుని వీటన్నింటికి సమాధానం చెప్పలేను. అంతకంటే నేనిప్పుడు ఏం చేయమంటారు?’’ అని అన్నారు. ఇక, పూజా హెగ్డే చెప్పిన సమాధానంతో ఒకరకంగా సల్మాన్‌తో ఆమె డేటింగ్ పుకార్లకు బ్రేక్ పడినట్లే అని చెప్పొచ్చు. కాగా, పూజా హెగ్డే నటించిన ‘‘ కిసి కా భాయ్ కిసి కా జాన్’ సినిమా మల్టీస్టారర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. జగపతి బాబు కూడా లీడ్ రోల్ చేస్తున్నారు.
ఫర్హద్ సంజి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, పూజా హెగ్డే తెలుగులో కూడా ఓ సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్- మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారని టాక్. మరి, తనతో తాను ప్రేమలో ఉన్నానన్న పూజా హెగ్డే కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.