స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ క్రమంలోనే నటి కరాటే కల్యాణి.. అతడిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక అసలు విషయానికొస్తే.. తెలుగు, తమిళ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న డీఎస్పీ.. ఈ మధ్య పాన్ ఇండియా పాటలో నటించాడు. డ్యాన్స్ కూడా చేశారు. ప్రపంచంలోనే టాప్ యూట్యూబ్ ఛానెల్ టీ సిరీస్ లో ఇది విడుదలైంది. ఇప్పటివరకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. హిందీలో ఉన్న ఈ పాటలో పలు అభ్యంతరకర పదాలున్నాయని భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ స్టామినా ఏంటో అందరికీ తెలుసు. ప్రస్తుతం కాస్త డౌన్ అయ్యాడు గానీ మనోడు పాటలు కంపోజ్ చేశాడంటే నెక్ట్స్ లెవల్ ఉంటాయి. ప్రస్తుతం ‘పుష్ప 2’ మాత్రమే దేవి శ్రీ ప్రసాద్ చేస్తున్న పెద్ద సినిమా. ఇకపోతే కొన్ని వారాల క్రితం డీఎస్పీ నటించిన ‘ఓ పరి’ సాంగ్ యూట్యూబ్ లో రిలీజైంది. నాలుగు వారాలకు పైనే అయిపోయింది. 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇలాంటి ఈ టైంలో భాజపా పార్టీతో పాటు పలు హిందూ సంఘాలు.. ఆ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.
కోట్లాది మంది జపించే హరేరామ హరే కృష్ణ పవిత్ర మంత్రాన్ని ఓ ఐటెం సాంగ్ కి పాడుతూ, బికినీలపై డ్యాన్స్ చేస్తూ కోట్లాది మంది హిందువుల మనోభావాలని గాయపరిచారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది! ఇక ఈ సాంగ్ దారుణంగా ఉందని, తక్షణం అన్నిచోట్లా దాన్ని డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు నటి కరాటే కల్యాణి, హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ లో దేవిశ్రీ ప్రసాద్ పై ఫిర్యాదు చేసింది. తక్షణమే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం ఈ విషయం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.