నందమూరి.. తెలుగు రాష్రాలలో ఈ పేరుకి ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక నందమూరి బాలకృష్ణకి మాస్ లో ఉండే ఫాలోయింగ్ అంతాఇంత కాదు. ఈ నేపథ్యంలోనే ఆయన నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మోక్షు త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనుండటంతో.. ఈసారి అతని పుట్టినరోజు వేడుకులను ఘనంగా నిర్వహించారు ఫ్యాన్స్. మోక్షజ్ఞ కూడా తొలిసారి కెమెరా ముందుకి వచ్చి.., పుట్టినరోజు వేడుకుల్లో పాల్గొని ఫ్యాన్స్ ని థ్రిల్ చేశాడు. ఈ నేపధ్యంలోనే గుంటూరు జిల్లాలో మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకల్లో కాస్త వివాదం చెలరేగింది.
తెనాలి సమీపంలోని వడ్లమూడి సెంటర్ లో మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహింహరు. పక్కనే ఉన్న ఓ ప్రముఖ కాలేజీ స్టూడెంట్స్ అంతా ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి హడావిడి చేశారు. వారిని అదుపు చేయడం పోలీసులకి కష్టంగా మారింది. కోవిడ్ రూల్స్ అమలులో ఉండటంతో వారి సంబరాలను పోలీసులు అడ్డుకున్నారు. కానీ.., విద్యార్థులు మాత్రం మాట వినలేదు. దీంతో.. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. అక్కడ నుండి ఫ్యాన్స్ ని తరిమి తరిమి కొట్టారు. దీంతో.., స్టూడెంట్స్ అంతా తలా ఓ దిక్కుకి పరుగులు తీశారు. మరి.. ఈ విషయంలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.