భారత దేశంలో ఇటీవల మహిళపై కామాంధుల అత్యాచారాలు రోజు రోజు కీ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతినిత్యం ఎక్కడో అక్కడ చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ప్రతినిత్యం ఈ ఘోరాలో ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు.. అత్యాచారాలకు సంబంధించిన వార్తలు చూస్తున్నాం. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా.. కొన్ని రోజులు జైల్లో గడిపిన కామాంధులు మళ్లీ మళ్లీ రెచ్చిపోతూనే ఉన్నారు. ఓ సినీ నటి భర్త విదేశీయురాలిపై అఘాయిత్యానికి పాల్పపడ్డాడని ఆరోపణలు రావడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ కి చెందిన శృంగార తార రాఖీ సావంత్ ఆమె భర్త ఆదిల్ ఖాన్ దురానీ కి మధ్య గత కొంత కాలంగా గొడవలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ జంట వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన విభేదాల కారణంగా ఏదో ఒక విషయంలో పదేపదే వార్తల్లోకి ఎక్కుతున్నారు. పెళ్లయిన కొద్ది రోజులకే తన భర్త ఆదిల్ వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని.. తన డబ్బు, నగలు మొత్తం కాజేశాడని.. ఆస్పత్రిలో తన తల్లి చావుబతుకుల్లో ఉంటే కాపాడలేకపోయాడని అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రాఖీ సావంత్. ఈ మేరకు పలు సెక్షన్ల కింద ఆదిల్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మైసూర్ లో ఆదిల్ ఖాన్ దురానీపై ఓ ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తనపై అత్యాచారం చేశాడని ఓ ఇరానీ మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో మైసూర్ లో వివి పురం పోలీస్ స్టేషన్ లో ఆదిల్ పై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు అయింది.
భారత్ లో చదువు కోవడానికి వచ్చిన ఇరాన్ యువతిని రాఖీ సావంత్ భర్త ఆదిల్ ఖాన్ మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొనబడి ఉంది. మైసూర్ లో సహజీవనం చేస్తున్న సమయంలో తనను వివాహం చేసుకుంటానని చెప్పి పలుమార్లు తనపై అత్యాచారం చేశాడేని మహిళ ఆరోపించింది. ఐదేళ్ల నుంచి తనను దారుణంగా మోసం చేస్తూ వచ్చాడని ఇరానీ యువతి ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు ఈ విషయం బయట చెబితే తన అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీస్ చేసి తన జీవితం నాశనం చేస్తాడని బెదిరించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చీటింగ్, బ్లాక్ మెయిలింగ్, రేప్ తదితర ఆరోపణల కింద ఆదిల్ ఖాన్ పై వివి పురం పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్ట్రర్ చేశారు. ప్రస్తుతం రాఖీ సావంత్ కేసులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు ఆదిల్.