నందమూరి తారకరత్న మరణంతో ఇండస్ట్రీలో పెను విషాదం చోటుచేసుకుంది. సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మరణంపై సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా తారకరత్న మరణంపై స్పందించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న మరణంపై స్పందించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి ఆఫీస్ ఆదివారం ఓ ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్‌లో.. ‘‘ నందమూరి తారకరత్న గారి హఠాన్మరణం చాలా బాధకలిగించింది. చలనచిత్ర రంగంలో ఆయన తన మార్కును చాటుకున్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాగా, తారకరత్న మరణంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తమ సంతాపం తెలియజేస్తున్నారు.
ఇప్పటికే తారకరత్న భౌతిక దేహం హైదరాబాద్, మోకిలలోని ఇంటికి చేరుకుంది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఇంటికి చేరుకుని తారకరత్న భౌతికదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. తారకరత్న సోదరులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు తారకరత్న ఇంటికి వెళ్లారు. సోదరుడి భౌతికదేహానికి నివాళులు అర్పించారు. బాధాతప్త హృదయాలతో కంటతడి పెట్టుకున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అక్కడికి వచ్చారు. అల్లుడి మృతదేహానికి నివాళులు అర్పించారు.
అనంతరం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లతో మాట్లాడారు. ముగ్గురు కుర్చీలో పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, రేపు సాయంత్రం తారకరత్న అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. రేపు ఉదయం ఆయన భౌతికదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించనున్నారు. అక్కడ అభిమానుల సందర్శనకోసం ఉంచనున్నారు. మరి, తారకరత్న హఠాన్మరణంపై మీ సంతాపాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 19, 2023