శ్రీముఖి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర మీద యాంకర్ గా, సినిమాల్లో నటిగా హవా సాగిస్తోంది. అందం, అభినయం, చలాకీతనంతో షోస్ ని రక్తి కట్టిస్తున్న శ్రీముఖికి ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది.
అదుర్స్ అనే టీవీ షోతో యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టిన శ్రీముఖి.. జులాయి సినిమాతో వెండితెరపై నటిగా ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ ముద్దుల చెల్లెలిగా నటించి అలరించింది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో లీడ్ రోల్ లో నటించి మెప్పించింది.
ధనలక్ష్మి తలుపు తడితే, సావిత్రి, నేను శైలజ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో అవకాశం దక్కించుకుంది.
ఆహాలో డ్యాన్స్ ఐకాన్, ఆదివారం విత్ స్టార్ మా పరివారం, మిస్టర్ అండ్ మిసెస్, సారంగ దరియా వంటి షోస్ తో ఫుల్ బిజీగా ఉంది. తనదైన యాంకరింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీముఖి.. సోషల్ మీడియాలోనూ అదే క్రేజ్ తో దూసుకుపోతోంది.
ఇన్స్టాగ్రామ్ లో 4.5 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన శ్రీముఖి రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు మూవీ అప్ డేట్స్, ఫోటో షూట్స్ కి సంబంధించిన ఫోటోలు అప్ లోడ్ చేస్తూ అభిమానులను కనువిందు చేస్తుంటుంది.
ఆ మధ్య పంకజముఖి సీత వంటి భామామణిలా వంకాయ రంగు చీరలో మెరిసి అందరినీ అలరించింది. తాజాగా లేలేత నడుముని చూపిస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. అప్పుడప్పుడూ పద్ధతిగా ఉన్న ఫోటోలను, మధ్య మధ్యలో కొంచెం హాట్ గా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ స్వీట్ అండ్ స్పైసీ గర్ల్ గా అందరి అటెన్షన్ ను డ్రా చేస్తోంది. డీగ్లామర్ రోల్స్ అయినా, గ్లామర్ రోల్స్ అయినా నేను రెడీ అని సిగ్నల్ ఇస్తోంది.
నీలి రంగు డ్రెస్ లో శ్రీముఖి అదిరిపోయింది. వయ్యారాలు ఆరబోస్తూ దిగిన ఫోటో షూట్ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వయసుపైబడిన వారి వయసు కూడా తగ్గించే మెడిసన్ లా శ్రీముఖి అందాలతో మతి పోగొడుతోంది. మగాళ్ల ఆర్కెస్ట్రా డిస్టర్బ్ అయ్యే రేంజ్ లో సోయగాలను ప్రదర్శిస్తోంది.
నీలి రంగు డిజైనర్ బ్లౌజ్ వేసుకుని, కింద లెహెంగా ధరించి రాజకుమారిలా ఫోజు ఇచ్చింది. డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా నుదిటి మీద చిన్ని నీలి రంగు బొట్టు పెట్టుకుని, కనురెప్పలకి నీలి రంగు ఐలాష్ పూసుకుని పదహారణాల తెలుగమ్మాయిలా కనబడుతోంది.
చెవులకు వేలాడే బుట్టలు.. ఏదో చెబుతున్నట్టు సందడి చేస్తున్నాయి. ఒక చేతికి వెరైటీ వెండి గాజులు వేసుకుని, ఒక చేతి వేలుకి వెరైటీ డిజైన్ కలిగిన ఉంగరాన్ని ధరించింది. ఈ ఆభరణాలన్నీ ఒక ఎత్తు అయితే, శ్రీముఖి అనే ఆభరణం మరొక ఎత్తు. నడుం మీద చేయి పెట్టుకుని.. కైపెక్కిస్తూ అందాలను ఒక క్రమపద్ధతిలో పేర్చింది.
శ్రీముఖి సొగసు చూడతరమా.. అన్నట్టు శ్రీముఖి ఇచ్చిన ఫోజులకి కుర్రాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయి పరిస్థితి. ప్రస్తుతం శ్రీముఖి ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఫోటోలని 70 వేలకు పైగా లవ్ చేశారు.
శ్రీముఖి అందాన్ని చూసి.. నీ కోసం ప్రేమ లేఖ రాద్దామని పేపర్ తీస్తే ఆ కాగితం నీ అందాన్ని చూసి కాగితం కంటే తెల్లగా, అందంగా ఉన్నావని హర్ట్ అయ్యి చిరిగిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి అందానికి కుర్రాళ్లు కవులుగా మారుతున్నారు. స్వయంవరంలో యువరాణిలా శ్రీముఖి అలా వలపుల బాణాలు విసురుతుంటే.. కుర్రాళ్ళకి గుచ్చుకోకుండా ఉంటాయా?