శ్రద్ధాదాస్.. ఒకప్పుడు హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. 2008లో అల్లరి నరేశ్ సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
ఆ తర్వాత ఒక్క తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్‌లోనూ నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది.
హీరోయిన్ రోల్స్ కాకపోయినా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ.. ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉంది.
ప్రస్తుతం అర్థం అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.
ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ అని చెబుతున్నారు. ఢీ14తో శ్రద్ధాదాస్ బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు.
హైపర్ ఆదితో వేసే పంచులు, డైలాగులు అందరినీ మెప్పిస్తాయి. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ భామ..
గత కొద్దిరోజులుగా గ్లామర్ డోస్ పెంచేసింది. ఎప్పటికప్పుడు అందమైన ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి మతులు పోగొడుతూ ఉంటుంది.
నీలిరంగు డ్రెస్‌లో ఉప్పొంగిన అందాలను కెమెరాలో బంధించి కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అటు మోడ్రన్, ఇటు క్లాసిక్ ఏ లుక్ అయినా తనకు సెట్ అవుతాయని ఇలాంటి పిక్స్ పెట్టి ప్రూవ్ చేస్తూ ఉంటుంది.