దీప్తీ సునైనా.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకి ఈమె గురించి ఇంట్రడక్షన్లు అవసరం లేదు.
ప్రస్తుతం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన చీరకట్టు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడొక సెలబ్రిటీగా మారిపోయింది.
బిగ్ బాస్ సీజన్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది.
బిగ్ బాస్ ద్వారా ఎంత ఫేమ్ వచ్చిందో.. ఆమె జీవితంలో అంత నష్టం కూడా జరిగింది. అవును.. బిగ్ బాస్ ద్వారానే ఆమె లవ్ బ్రేక్ అయిందని అందరికీ తెలిసిందే.
టిక్ టాక్ బ్యాన్ తర్వాత రీల్స్, కవర్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.ప్రస్తుతం లవ్ సంగతి పక్కన పెట్టేసి.. కెరీర్ మీద దృష్టి సారించింది.
దీప్తీ సునైనా ఓ సినిమాలో కూడా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. కేవలం నెగిటివిటీతో పాపులర్ అయిన స్టార్ ఈమె. నెట్టింట అన్నీ బ్యాడ్ కామెంట్స్ తోనే ఈమె క్రేజ్ బాగా పెరిగిపోయింది.