బాలీవుడ్ యువ నటుడు వర్థన్ పూరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ తనదైన విలనిజంతో భయపెట్టిన అమ్రిష్ పూరీ గుర్తున్నారుగా ఆయన మనవడే ఈ వర్థన్ పూరీ. తాతయ్య వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. సరైన అవకాశాలు లేకపోవడంతో పాపులర్ కాలేకపోయాడు. తనకు సినిమా అవకాశాలు రానందుకు అంతగా బాధలేదని, కానీ తన అవసరాన్ని వాడుకోవాలని చాలా మంది ప్రయత్నించారన్నాడు.
సినిమానే కాదూ ఏ రంగంలోనైనా మహిళలను ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కాస్టింగ్ కౌచ్. ఇది ఆడవాళ్లే కాదూ మగవాళ్లూ ఎదుర్కొంటున్నారని అన్నారు. తన తాతయ్య ఫేమస్ నటుడైనా, తాను ఇది ఎదుర్కొన్నానని, దేవుడి దయ వల్ల తప్పించుకున్నానని అన్నారు. చాలా మంది డైరెక్టుగానే కోరికలు తీర్చాలని అడుగుతుంటారని, తనకు ఈ అనుభవం ఎదురైందని అన్నారు. డబ్బు ఇస్తే ఏ పనైనా చేసి పెడతా అని కొందరు అడిగినట్లు తెలిపాడు. ఇండస్ట్రీలో ఫలానా వాళ్లు తెలుసునని, వారిని పరిచయం చేస్తామని చెప్పి కొందరు మోసం చేస్తారని అన్నారు. వారు అసలు పరిశ్రమకు చెందిన వారే కాదన్నారు.
తాను సినిమాలోకి వస్తా అన్నప్పుడు తాతయ్య తనకో మాట చెప్పారన్నారు. సినిమాలోకి రాక ముందు థియేటర్ వర్క్ చేసేవాళ్లు సినిమాలోకి వచ్చాక తమకు తామే స్టార్లుగా ఫీలవుతుంటారని, అలాంటి వారి జోలికి వెళ్లదని చెప్పారన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సూచించారని, ఇవి ఫాలో అయితే జీవితంలో ఓటమి శాతం తక్కువగా ఉంటుందని ఆయన చెప్పినట్లు వర్థన్ పూరీ గుర్తు చేసుకున్నారు. అవి నాకు బైబిల్ తో సమానమన్నారు.
తన తాతయ్య చెప్పినట్లు తాను ఉంటే.. అంత డబ్బిస్తే ఇది చేసి పెడతా, అది చేసి పెడతా అంటూ తనను వాడుకోవాలని చూశారని, అందుకే జాగ్రత్త పడుతున్నానని వ్యాఖ్యానించారు. 2019లో ‘యే సాలీ ఆషిఖి’ అనే సినిమాలో నటించాడు వర్ధన్, ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో కలిసి ‘నౌటంకి’ అనే సినిమా చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కొంత భాగం షూట్ అయ్యాక ఆగిపోయింది.