సినిమా వాళ్లను చూడ్డం కోసం వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగటం కోసం జనం పెద్ద ఎత్తున రావటం సహజం. ఇలాంటి సమయంలో సినిమా వాళ్లకు ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి.
సాధారణ జనానికి సినిమా వాళ్లంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హీరో, హీరోయిన్లపై వారు ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు. సినిమా వాళ్లు ఎక్కడికైనా వస్తే చాలు చూడ్డానికి ఎగబడిపోతుంటారు. వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగటానికి ఓ యుద్దమే చేస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు గుంపులు, గుంపులుగా సెలెబ్రిటీల మీదకు ఎగబడిపోతుంటారు. ఇలాంటి సమయంలో సెలెబ్రిటీల పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అభిమానుల నుంచి తప్పించుకోవటానికి వారు అల్లాడిపోవాల్సి వస్తుంది. తాజాగా, ప్రముఖ హీరోయిన్ దిశ పటాని పరిస్థితి కూడా ఇలానే అయింది. అభిమానులు ఆమెతో సెల్ఫీలు, ఫొటోలకోసం ఎగబడి ఇబ్బంది పెట్టారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా, ఆమె ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. రెస్టారెంట్‌లో పని అయిపోయిన తర్వాత ఆమె బయటకు వస్తూ ఉన్నారు. దిశ పటాని గురించి తెలిసిన జనం పెద్ద ఎత్తున రెస్టారెంట్ దగ్గరకు చేరుకున్నారు. ఆమె బయటకు వస్తుంటే ఫొటోలు, సెల్ఫీలకోసం ఎగబడ్డారు. దీంతో దిశా పటాని ఇబ్బందికి గురయ్యారు. భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు తీసుకురావటానికి తీవ్ర ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, దిశా పటాని 2015లో వచ్చిన లోఫర్ సినిమా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రముఖ క్రికెటర్ ఎమ్‌ఎస్ ధోనీ బయోపిక్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ వెంటనే ప్రముఖ ఇంటర్ నేషనల్ స్టార్ జాకీచాన్‌తో కలిసి నటించే అవకాశం ఆమెకు వచ్చింది. దిశా పటాని ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఆమె సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. మరి, దిశా పటానిని ఇబ్బంది పెట్టిన అభిమానుల ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.