ఎప్పుడూ ఏదో ఒక ఆఫర్ తో వినియోగదారులను ఆకట్టుకునే పేటీఎం.. మరోసారి సరికొత్త ప్రకటనతో ముందుకొచ్చింది. ఈసారి అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు. ముఖ్యంగా చెప్పాలంటే టాలీవుడ్ టాప్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు షాకిచ్చే ఆఫర్ తీసుకొచ్చింది పేటీఎం. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా RRR చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి పేటీఎం ఓ ఆఫర్ ప్రకటించింది. దీనికి సంబంధించి వార్త ట్వీటర్ ద్వారా తెలియజేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో కొమ్రం భీం గా జూనియర్ ఎన్టీర్ అలాగే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. అభిమానులను కనువిందు చేయనున్నారు. ఇలాంటి సమయంలో 3R అభిమానుల కోసం పేటీఎమ్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.ఆ మూవి టికెట్ ను కేవలం రూపాయికే పొందవచ్చని పేటీఎం వెల్లడించింది.
ఇందుకోసం వినియోగదారులు ఈ యాప్ ద్వారా పేటీఎం జెనీ మొబైల్ నంబరుకు రూపాయి పంపిస్తే.. 150 రూపాయల వరకు విలువైన ట్రిపుల్ ఆర్ మూవీ టికెట్ వోచర్ ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు పేటీఎం జెనీకి పంపిన రూపాయిని కూడా తిరిగి మళ్లీ సదురు ఖాతాలోకి జమ చేయనున్నట్లు యాజమాన్యం తెలిపింది. దీన్నిబట్టి చూస్తే.. ట్రిపుల్ ఆర్ మూవీ టికెట్ ను ఉచితంగా పొందవచ్చు అన్నమాట. అయితే ఈ ఆఫర్ కేవలం మార్చి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.