ఇండస్ట్రీలో డెబ్యూ సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకోవడం అంత ఈజీ కాదు. ఒకప్పుడు కొన్ని సినిమాలు చేస్తేగాని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేవి కాదు.. కానీ.. ఇప్పుడా స్టాండర్డ్స్ అన్నీ మారిపోయాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా ఇట్టే వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా ప్రమోషన్స్, ఫ్యాన్ బేస్ కూడా సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. టాలీవుడ్ లో కొన్నాళ్లుగా డెబ్యూ సినిమాలతో హీరోయిన్స్ సూపర్ క్రేజ్ దక్కించుకుంటున్నారు. అలా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని.. బెస్ట్ డెబ్యూ అందుకున్న బోల్డ్ బ్యూటీ పాయల్ రాజపుత్.
పాయల్ గురించి నార్మల్ ఆడియెన్స్ తో పాటు గ్లామర్ ప్రియులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీలో సీరియల్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన ఈ ఢిల్లీ భామ.. 2018లో ‘ఆర్ఎక్స్100’ మూవీతో తెలుగులో డెబ్యూ చేసింది. కార్తికేయ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే.. డెబ్యూ మూవీ అయినప్పటికీ, బోల్డ్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులను ఫిదా చేసింది. రొమాన్స్, నెగటివ్ యాంగిల్ లో రెచ్చిపోయి.. గ్లామర్ పరంగా కూడా యూత్ కి బాగా దగ్గరైంది. కట్ చేస్తే.. బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా సైమా అవార్డు సొంతం చేసుకుంది.
ఇక పాయల్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది. తెలుగులో స్టార్స్ తో పాటు యంగ్ స్టర్స్ లతో కూడా రొమాన్స్ చేస్తోంది పాయల్. హిట్స్ ప్లాప్స్ లెక్కచేయకుండా వరుసగా సినిమాలైతే చేసుకుంటూ పోతుంది. కాగా.. తాజాగా పాయల్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హాట్ పిక్స్ నెట్టింట సెగలు రేపుతున్నాయి. కేవలం టవల్ అడ్డు పెట్టుకొని.. పాయల్ పోస్ట్ చేసిన సెల్ఫీలను.. ఆమె ఫ్యాన్స్ తీయని కుల్ఫీలుగా ఉన్నాయంటూ నేత్రానందంతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం పాయల్ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పాయల్ పోస్ట్ చేసిన పిక్స్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.