Pawan Kalyan: స్టార్ హీరోలు అప్పుడప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్స్ మార్చుతుంటారు. అవును.. వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ ఇష్టం.. మారుస్తారు అనిపించవచ్చు. ఏ హీరో మార్చినా అలాగే అనుకోని వదిలేస్తారు ఫ్యాన్స్. కానీ.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ డీపీ మార్చితే సోషల్ మీడియాలో ఎన్నడూలేని రచ్చ మొదలైంది. కేవలం ఫోటో మార్చితే ట్రెండ్ అవుద్దా అనిపించవచ్చు.
తాజాగా పవన్ ట్విట్టర్ ఫోటో చేంజ్ చేయగానే ఒక్కసారిగా జాతీయ స్థాయిలో #PawanKalyan హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో పవన్ డీపీని అభిమానులంతా సోషల్ మీడియాలో తెగవైరల్ చేస్తున్నారు. ‘ఒక డీపీ మారిస్తేనే పవన్ కళ్యాణ్ పేరు ట్రెండింగ్ అవుతుందంటే.. ఆయన ప్రతి కదలిక ఎంతటి ప్రభావం చూపగలదో ఆలోచించండి. భావితరాల నుదుటి రాతను మార్చగల శక్తి ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇద్దాం! భవిష్యత్తుని మార్చుకుందాం!!” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం మనం చూడవచ్చు.
అంతేగాక.. ఇదెక్కడి మాస్ రా మామ ఒక్క డీపీ మార్చినందుకే ట్రెండింగ్ లో ఉంది. అందుకే అన్నని ట్రెండ్ సెట్టర్ అన్నారని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ డీపీ చేంజ్ చేయడంతో ట్విట్టర్ లో ఓ చర్చకు తెరలేపారు. జనసేనాని ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఇక పవన్ చేతిలో వీరమల్లు మూవీతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సితం’ తెలుగు రీమేక్ లైనప్ చేసిన సంగతి తెలిసిందే. మొదటిసారి పవన్ తో కలిసి సాయిధరమ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకుంటుండటం విశేషం. మరి ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలను బ్యాలెన్సింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#PawanKalyan
CEO of craze❤️ pic.twitter.com/hoPNAkkeUw— Bhanu pspk❤️⭐ (@BhanuPr87591189) July 8, 2022
ఒక DP మరిస్తేనే trending లో #PawanKalyan ఉన్నారు అంటే ఆయన ప్రతి కదలిక ఎంతటి ప్రభావం చూపగలదో ఆలోచించండి
భావితరాల నుదుటి రాతను మార్చగల శక్తి ఉన్న నాయకులు @PawanKalyan గారు
ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇద్దాం!
భవిష్యత్తుని మార్చుకుందాం!!@JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila pic.twitter.com/MG4TzE7HCJ— Niharika Naidu (🩸B+) 🇮🇳 JanasenaParty-LOGOPHILE (@NiharikaJSP) July 8, 2022