తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కెరీర్ ప్రారంభించినా.. తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ ఫ్యాన్స్ కి దగ్గరయ్యారు పవన్ కళ్యాణ్. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ప్రజలకు మరింత సేవ చేయాలనే యోచనతో జనసేన పార్టీ స్థాపించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. ప్రజలకు మాత్రం అండగానే ఉంటున్నారు.
ఇక ఇండస్ట్రీకి మూడేళ్లు గ్యాప్ తీసుకొని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపారు పవన్. అంతేకాదు వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమా అప్డేట్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ వదిలారు.
“భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్, యంగ్ లుక్‌లో కన్పిస్తున్నారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ న్యూ లుక్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇండియా గేట్ ముందు స్పోర్ట్స్ బైక్ మీద కూర్చుని పవన్ ఒక చేతిలో టీ, మరో చేతిలో మెగాఫోన్ తో కన్పించిన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ఈసారి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు’ అనే ట్యాగ్‌లైన్ ఉత్సుకతని రేకెత్తించింది.
ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలాగే ప్రజెంట్ చేస్తా అని గతంలో దర్శకులు హరీష్ శంకర్ అన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ తోనే మెగాభిమానుల మనసు దోచుకున్నాడు. వారి అంచనాలను అందుకునేలా ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిజైన్ చేయడంలోఆయన సక్సెస్ అయ్యాడు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్ కాగా, ఎడిటింగ్ చోటా కె ప్రసాద్.
A film by @harish2you 😎 pic.twitter.com/VNVnohCcxd
— Mythri Movie Makers (@MythriOfficial) September 9, 2021
We all need your …
Blessings & Best wishes…. 🙏🙏@PawanKalyan @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro
Let’s rock again….. #BhavadeeyuduBhagatSingh pic.twitter.com/T5reLKI5P9
— Harish Shankar .S (@harish2you) September 9, 2021