పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తున్న ‘బ్రో’ మూవీలో ఆయన స్టైలింగ్ డిఫరెంట్‌గా అనిపిస్తోంది. ఈమధ్య కాలంలో పవన్ ఇంత ఎనర్జీగా అలాగే కలర్‌ఫుల్‌గా కనిపించలేదు.
సినిమాలతో పాటు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన న్యూస్ ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది. వారు నివసించే ఇళ్లు, వాడే కార్లు, గాడ్జెట్స్, ప్రాపర్టీస్, వాటి వాల్యూ అలాగే ధరించే డ్రెస్సెస్ దగ్గరినుండి పెట్టుకునే ఆర్నమెంట్స్, వాటి ధరలు తెలిస్తే షాక్‌తో పాటు సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ కాబట్టి వారి స్టేటస్‌ని బట్టే మెయింటినెన్స్ కూడా సాలిడ్‌గా ఉంటుంది. ఇక సెలబ్స్ రియల్ లైఫ్ రేంజ్ గురించిన వార్తలు, వాటిని బేస్ చేసుకుని చేసే మీమ్స్ సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతాయో తెలిసిందే. రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూ కాస్ట్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం ‘బ్రో’ (ది అవతార్). యాక్టర్ కమ్ డైరెక్టర్ పి.సముద్రఖని తెరకెక్కిస్తుండగా.. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఇస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా పవన్ గెటప్, స్టైల్ చూస్తే ‘తమ్ముడు’, ‘బద్రి’ రోజులు గుర్తొచ్చాయి. మెగా మామా అల్లుళ్ల క్రేజీ కాంబో అనౌన్స్ చేసినప్పటి నుండే ఈ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జెట్ స్పీడ్‌తో జరుగుతోంది. జూలై 28న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ పోస్టర్‌లో కనిపించిన గెటప్ చూసి, అందులో ఆయన వేసుకున్న షూస్ గురించి న్యూస్ వైరల్ అవుతుంది.
పవర్ స్టార్ బాలెన్సియాగా (Balenciaga) బ్రాండ్‌కి చెందిన డిఫెండర్ బ్లాక్ స్నీకర్స్ వేసుకున్నారు. వాటి ధర రూ.88,732/-. ఈ షూ చూడ్డానికి స్టైల్‌గా కనిపించడమే కాక కంఫర్ట్‌బుల్‌గానూ ఉంటాయట. ఇక ‘బ్రో’ మూవీలో ఆయన స్టైలింగ్ డిఫరెంట్‌గా అనిపిస్తోంది. ఈమధ్య కాలంలో ఇంత ఎనర్జీగా అలాగే కలర్‌ఫుల్‌గా కనిపించలేదు పవన్. దీంతో టీజర్ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ జ్వరంతో బాధపడుతూనే ‘బ్రో’ టీజర్ డబ్బింగ్ ఫినిష్ చేశారు. సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఓజీ’ సగం పార్ట్ షూట్ కంప్లీట్ అయింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఇది.