పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణం, సుజీత్ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ తర్వాతి ప్రాజెక్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ దర్శవకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మార్చి 30 2023న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో భవదీయుడు భగత్‌సింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు వెంటనే మరో ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. వరుస సినిమాలతో పవన్ ఫుల్ బిజీగా మారబోతున్నారు. సుజీత్- పవన్ కల్యాణ్ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదలచేశారు.
డైరెక్టర్‌గా సుజీత్ ఇప్పటికే తనని తాను నిరూపించుకున్నాడు. పక్కా కమర్షియల్ సినిమాని హ్యాండిల్ చేయడంలో సుజిత్‌కు మంచి మార్కులే పడ్డాయి. పవన్ కోసం తీయబోయే సినిమా కూడా దేనికీ రీమేక్ కాదని, ఫ్రెష్ కథతో సుజిత్ ముందుకొస్తున్నట్లు చెబుతున్నారు. కావాల్సినన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. సినిమా యూనిట్ విడుదల చేసిన పోస్టర్ కూడా ఎంతో కొత్తగా ఉంది. ఆ పోస్టర్‌లోనే కథపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. పవన్ కల్యాణ్ అటు తిరిగి నిల్చున్న ఫొటో ఒకటి ఉంది. పోస్టర్ మీద బుద్ధుడి విగ్రహం, విదేశీ కట్టడాలు, కోటని పోలిన చిత్రాలు ఉన్నాయి. దానిని బట్టి ఫ్యాన్స్ కూడా కథ గురించి చాలానే ఊహాగానాలు చేస్తున్నారు.
We are extremely elated to associate with @PawanKalyan Garu, for our next production.⚡️⭐️
Directed by @SujeethSign, DOP by @DOP007.#FirestormIsComing 🔥🔥 pic.twitter.com/Dd91Ik8sTK
— DVV Entertainment (@DVVMovies) December 4, 2022
అలాగే పోస్టర్‌పై రెండు ఇంట్రస్టింగ్ విషయాలు దాగున్నాయి. అవేంటంటే ఇంగ్లీష్‌లో ‘దే కాల్ హిమ్ #OG’ అని రాసుంది. అలాగే పవన్ కల్యాణ్ ఫొటోకి నీడగా ఒక గన్నును పెట్టారు. అలాగే పోస్టర్‌పై జపనీస్ భాషలో ఒక లైన్ కూడా రాసుంది. పోస్టర్ మీదున్న వాటిని డీకోడ్ చేసే పనిలో ఫ్యాన్స్ అంతా తలమునకలై ఉన్నారు. అయితే అసలు ఆ పోస్ట్ మీదున్న విషయాలు ఏంటే పరిశీలిద్దాం. అక్కుడన్న జపనీస్ అక్షరాలకు ఇంగ్లీష్‌లో ‘Fire Storm Is Coming’ అని అర్థం అంటున్నారు. అంటే ఒక భయంకరమైన ప్రళయం రాబోతోంది అని. అలాగే #OGకి అర్థం ఏంటంటే.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనమాట. పవన్ నీడకు గన్‌ని పెట్టడం, ఈ లైన్స్, పోస్టర్‌పై ఉన్న చిత్రాలు అన్నీ చూస్తుంటే సుజీత్ చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు అంటున్నారు. గ్యాంగ్ స్టర్‌గా పవన్‌ని ఊహించుకుని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సంబరాలు స్టార్ చేశారు.
There are Many things that our fan boy Director kept for his Demigod in the poster!! 😉
Search & share with us what your co-fan has put in.. #FirestormIsComing 🔥🔥 pic.twitter.com/1FoPDL2OhG
— DVV Entertainment (@DVVMovies) December 4, 2022
ఒక పవన్ కల్యాణ్ అభిమానిగా తన హీరోకి బీభత్సమైన ఎలివేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సుజిత్ సాధారణంగానే ఎలివేషన్స్ ఇవ్వడంలో దిట్ట. అదికూడా అతని అభిమాన హీరో. మరి.. సినిమా ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఇమాజినేషన్‌కే వదిలేయాలి. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తర్వాత ట్విట్టర్‌లో హరీశ్ శంకర్ ఒక వీడియో షేర్ చేశాడు. అదేంటంటే గబ్బర్ సింగ్ సినిమా థియేటర్ బయట సుజీత్ తలకు రెడ్ టవల్ కట్టుకుని నినాదాలు చేస్తూ ఉన్నాడు. ఆ వీడియో షేర్ చేస్తూ.. “నీ ఫ్యాన్ బాయ్ మూమెంట్‌కు చాలా థాంక్స్. నువ్వు కూడా మన పవన్ కల్యాణ్‌తో నీ నెక్ట్స్ ప్రాజెక్టుకు నాకు ఇలాంటి ఎగ్జైమెంట్ ఇవ్వు. ఆల్ ది బెస్ట్” అంటూ హరీశ్ శంకర్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం పవన్- సుజిత్ ప్రాజెక్ట్ పై నెట్టింట బాగానే చర్చ జరుగుతోంది. ఎవరికి నచ్చిన కథను వాళ్లు ఊహించుకుంటున్నారు. అయితే గ్యాంగ్‌స్టర్ స్టోరీ అని మాత్రం క్లూస్ ఇచ్చారు.
Hey @sujeethsign thanks for this fanboy moment am sure you will also give me same excitement with your upcoming project with our one and only @PawanKalyan 🔥 🔥 …all the best buddy 👍👍👍 pic.twitter.com/vlUlFqoFdD
— Harish Shankar .S (@harish2you) December 4, 2022