అకిరా నందన్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడిగానే కాకుండా తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. స్టార్ కిడ్ అనే ప్రౌడ్, ఆటిట్యూడ్ లేకుండా అచ్చు తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో హుందాగా వ్యవహరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా 18 ఏళ్లు దాటగానే రక్తదానం చేసి.. సామాజిక బాధ్యత గల వ్యక్తి అని నిరూపించుకున్నాడు. అకిరా నందన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, రేణూ దేశాయ్ మాత్రం అలాంటిది ఏమీ లేదు.. జరగబోదు అని తేల్చి చెప్పేసింది. అయితే అకిరా నందన్ లో ఉన్న టాలెంట్లు మొత్తం అభిమానులకు పరిచయం చేస్తూనే ఉంటుంది.
గతంలో కర్ర సాము, బాక్సింగ్ చేస్తూ అకిరా నందన్ అందరినీ ఆశ్యర్యపరిచాడు. ప్రస్తుతం అతనిలో ఉన్న మ్యూజీషన్ ని అభిమానులకు పరిచయం చేశాడు. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు రీసెంట్ హిట్.. సర్కారు వారి పాట సినిమాలోని కమాన్ కమాన్ కళావతి సాంగ్ ని పియానోపై వాయించి ఔరా అనిపించాడు. అకిరాలో ఉన్న కొత్త టాలెంట్ చూసి అభిమానులు ఆశ్యర్యపోతున్నారు. తండ్రిలాగే అన్ని టాలెంట్లు ఉన్నాయంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం అకిరా నందన్ మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అకిరా నందన్ కొత్త టాలెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.