ఈ మధ్యకాలంలో హీరోల పుట్టినరోజులను అభిమానులు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు అలాగే జరుగుతున్నాయి. బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానులు.. మరోసారి థియేటర్ లలో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీస్ ఒక్కడు, పోకిరి సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక హాలీవుడ్ పర్సనాలిటీ కలిగిన మహేష్ బాబు.. అందగాడు మాత్రమే కాదు, అందమైన మనసున్న వాడని అందరికి తెలిసిందే. ప్రతీ ఏడాది ఆగష్టు 9 వచ్చిందంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాలలో మహేష్ ఫ్యాన్స్ సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే.. ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీకి సంబంధించి ఎందరో సెలబ్రిటీలు, హీరో హీరోయిన్స్ మహేష్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అందరూ మెచ్చే, ప్రేమించే మహేష్ బాబుకు జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో మహేష్ బాబు జల్సా సినిమాలో పవన్ క్యారెక్టర్ ని పరిచయం చేసేందుకు తన గాత్రం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మహేష్ ని విష్ చేస్తూ.. “మహేష్ బాబుకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తనదైన శైలి నటనతో నవతరాన్ని మెప్పిస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా హృద్రోగంతో బాధపడే చిన్నారులకు ఆపరేషన్స్ చేయించడం అభినందనీయం. సూపర్ స్టార్ కృష్ణగారి నట వారసత్వాన్ని కొనసాగిస్తూనే.. దర్శకులు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు.
అర్జున్ సినిమా టైంలో మహేష్ బాబు గారు గళం విప్పితే ఆయనకు నేను మద్దతు తెలిపాను. అలాగే జల్సా సినిమాలో సంజయ్ సాహు పాత్రను పరిచయం చేసేందుకు మహేష్ బాబు నేపథ్య గాత్రం అందించడం ఆయన సహృదయతకు నిదర్శనం. తనదైన పంథాలో సినిమాలు చేస్తూ.. ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలు అందుకుంటున్న మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అంటూ పవన్ విష్ చేశారు. మరి మహేష్ బాబు బర్త్ డేపై మీ విషెష్ కామెంట్స్ లో తెలియజేయండి.
శ్రీ మహేష్ బాబు @urstrulyMahesh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/JK3xh4xJtI
— JanaSena Party (@JanaSenaParty) August 9, 2022